
పద్మశ్రీ పురస్కార గ్రహీత, లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద కొద్ది కాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్న సంగతి తెలసిందే. 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) ఎన్నికలు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ మధ్యన విడుదలైన 'సన్ ఆఫ్ ఇండియా' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్స్... ప్రతి అంశంలోనూ ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి. 'సన్ ఆఫ్ ఇండియా' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఇద్దరు హీరోలు కావాలని ట్రోల్స్ చేయిస్తున్నారని మోహన్ బాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ ఇద్దరు హీరోలు ఎవరనే చర్చ మొదలైంది. తాజాగా మోహన్ బాబు మరోసారి ట్రోలర్స్ దొరికిపోయారు.
మంచు ఫ్యామిలీ మళ్లీ వార్తల్లోకి ఎక్కేసింది. తాజాగా విద్యానికేతన్‌లో తెలుగు భాషాదినోత్సవాన్ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. దీంతో మోహన్ బాబు ఫోటోతో కలిపి తెలుగు భాషా దినోత్సవం సెలెబ్రేషన్స్ అని రాసి ఓ హోర్డింగ్ పెట్టారు. కానీ కామెడీ ఏంటంటే.. తెలుగు భాషా దినోత్సవం అని తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో రాసి పెట్టారు. దీంతో జనాలు ట్రోల్స్ మొదలెట్టేసారు. తెలుగు భాషా దినోత్సవం అని చెప్పి.. అంతా ఇంగ్లీష్ లోనే పెట్టారు కదా? ఇదెక్కడి కామెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ట్రోలర్స్ పై మంచు విష్ణు ఊరుకోవటం లేదు కేసులు పెట్టేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే చాలా యూ ట్యూబ్ చానెల్స్ మీద కేసులు పెట్టారని సమాచారం. అలాగే ఒక్కొక్కడికి మడత పడిపోతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. సన్ ఆఫ్ ఇండియా సినిమా ప్రమోషన్లలో తన పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై మోహన్ బాబు మాట్లాడారు.
సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌ని తెలిసిన వాళ్లు తనకు పంపిస్తుంటారని తెలిపారు. ఒక్కోసారి వాటిని చూసినప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంటుందన్నారు. ట్రోల్స్ అంటే నవ్వించేలా ఉండాలి కానీ, అసభ్యకరంగా ఉండకూడదన్నారు. తనను ట్రోల్ చేస్తున్న ఆ హీరోలు ఎవరో కూడా తెలుసని, వాళ్లు తాత్కాలికంగా ఆనందం పొందవచ్చు... కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని కామెంట్స్ చేశారు
మొన్నామధ్య భక్త కన్నప్ప ప్రాజెక్ట్ గురించి మోహన్ బాబు చెప్పిన మాటలు, సినిమాను ప్రారంభించిన ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇక ఈ చిత్రం గురించి, షూటింగ్ గురించి విష్ణు చెప్పిన మాటల మీదా ట్రోల్స్, మీమ్స్ పడ్డాయి. ఈ సినిమాకు ఎంత ఖర్చు అవుతుందో.. ఎలాంటి క్యాస్టింగ్ ఉంటుందో ఊహకు కూడా అందదు అంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేశారు. అయితే మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ అనేది కొత్తేమీ కాదు. వారేం మాట్లాడినా, ఏం చేసినా కూడా కొంత మంది ట్రోల్స్ చేస్తూనే ఉంటున్నారు. మంచు ఫ్యామిటీ అంటేనే ట్రోలర్లు రెచ్చిపోతారు. దానికి మరింత మసాలా యాడ్ చేస్తారు.