ప్రభాస్ కాదట.. శ్రీరాముడు పాత్రలో న‌టించిందెవరో తెలుసా?

Published : Sep 15, 2025, 10:08 AM IST
Gaurav Bora

సారాంశం

Mirai Movie: యంగ్ హీరో తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీ వరల్డ్‌వైడ్‌గా భారీ కలెక్షన్లు సాధిస్తోంది. క్లైమాక్స్‌లో రాముడి క్యారెక్టర్ హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్ అనుకున్నా, అసలు ఆ రోల్ లో బాలీవుడ నటుడు గౌరవ్ బోరా చేశారట.  

మిరాకిల్ ‘మిరాయ్’

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘మిరాయ్’. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ.50 కోట్ల మార్క్ దాటేసింది. తొలి వీకెండ్ లో వసూళ్లు సాధించడం ద్వారా సినిమా సక్సెస్ రికార్డులు సృష్టించింది. అయితే కలెక్షన్ల కంటే.. ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చర్చ ఒకటే అదే రాముడి పాత్ర

రెండే నిమిషాలు.. కానీ ఇంపాక్ట్ ఎక్కువ!

‘మిరాయ్’ క్లైమాక్స్‌లో రాముడి పాత్ర కనిపించేది కేవలం రెండు నిమిషాలే అయినా.. ఆ రోల్ మూవీకి అసలు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ పాత్రపై ఇంత క్యూరియసిటీ రావడానికి కారణం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ఈ మూవీలో రెండు బిగ్ ట్విస్ట్ లున్నాయి. అలాగే డార్లింగ్ ప్రభాస్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పడంతో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ఫ్యాన్స్ ఊహించారు. అంతేకాకుండా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సీన్ చూసి మరింత ఉత్కంఠ పెరిగింది. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు అయితే.. ‘ఏఐ’సాయంతో ప్రభాస్‌ని రాముడిగా చూపిస్తూ ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేశారు. దీంతో రాముడి పాత్రపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. కానీ చివరికి సినిమా చూస్తే.. ఆ రోల్ ప్రభాస్ చేయలేదని తేలిపోయింది.

రాముడిగా నటించింది ఎవరు?

రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించకపోయేసరికి డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారనే చెప్పాలి. కానీ, రాముడు పాత్రలో నటించిందెవరు? అనే సందేహం మాత్రం అందరి మనసులో మెదులుతుంది. చివరికి తెలిసిందేమిటంటే, ఆ పాత్రలో నటించినది ఓ బాలీవుడ్ నటుడు. అతడే గౌరవ్ బోరా. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కి చెందిన గౌరవ్ మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసి, యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ తో థియేటర్‌ ఆర్స్ట్ లో చేరారు. ఐదేళ్లపాటు పలు నాటకాలు, షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్‌లో నటించిన ఆయన, ఓ వెబ్ సిరీస్‌లో కూడా మెరిశారు. అంతేకాకుండా టీవీఎస్ ఐ క్యూబ్, సపోలా ఆయిల్, బజాజ్ ఫ్రీడమ్, టాటా క్యాపిటల్ వంటి బ్రాండ్స్ కమర్షియల్ యాడ్స్‌లో నటించారు.

కార్తీక్ ఎంపిక – వీఎఫ్ఎక్స్ మాజిక్

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఎక్కడో గౌరవ్‌ని గమనించి, రాముడి పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. కేవలం రెండు రోజులపాటు కీలక సీన్స్ షూట్ చేసి, వాటిపై వీఎఫ్ఎక్స్ జోడించి స్క్రీన్‌పై అద్భుతంగా ఎలివేట్ చేశారు. రాముడి పాత్ర వచ్చిన క్షణంలోనే థియేటర్ అంతా గూస్ బంప్స్‌తో నిండిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు.

వాస్తవానికి తెలుగు సినిమా చరిత్రలో ఎన్టీఆర్ రాముడి పాత్రకు ఒక స్థాయిని ఇచ్చారు. ఆ తర్వాత బాలకృష్ణ కూడా తనదైన రీతిలో ఆ పాత్రలో మెరిశారు. అయితే ఆ తర్వాత పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఈ తరుణంలో ‘మిరాయ్’లో గౌరవ్ బోరా రెండు నిమిషాలపాటు మాత్రమే కనిపించినా, తన లుక్, ప్రెజెన్స్‌తో గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఇలా మిరాయ్ మూవీతో ఈయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇక మిరాయ్ మూవీ ద్వారా గుర్తింపు రావడంతో తెలుగు ఇండస్ట్రీలో గౌరవ్ బోరా కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్