తమన్నా షో లో.. రామ్ చరణ్, రవితేజ?

Published : Jun 25, 2020, 08:40 AM IST
తమన్నా  షో లో.. రామ్ చరణ్, రవితేజ?

సారాంశం

తమన్నా చేత టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు వచ్చింది. వెంటనే తన టీమ్ చేత ఆమెకు సరబడ ఓ టాక్ షో ప్లాన్ చేయించి,లాక్ చేయించినట్లు సమాచారం. త్వరలోనే ఆహాలో తమన్నా టాక్ షో రానుంది. ఈ మేరకు త్వరలో ప్రకటన వచ్చే అవకాసం ఉంది.  

వయస్సు పెరుగుతున్నా ఎక్కడా తగ్గకుండా వరసగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతోంది తమన్నా. కేవలం హీరోయిన్ గానే కాదు.. గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ ఇలా అవకాసం ఉన్నచోటల్లా మెరుస్తోందీ బ్యూటీ. ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపధ్యంలో ఆమె చేత టాక్ షో చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కు వచ్చింది. వెంటనే తన టీమ్ చేత ఆమెకు సరబడ ఓ టాక్ షో ప్లాన్ చేయించి,లాక్ చేయించినట్లు సమాచారం. త్వరలోనే ఆహాలో తమన్నా టాక్ షో రానుంది. ఈ మేరకు త్వరలో ప్రకటన వచ్చే అవకాసం ఉంది. అయితే తమన్నా టాక్ షో అనగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. టాక్ షో అంటే మంచు లక్ష్మి గుర్తు వస్తుంది. ఆమె చేసిన టాక్ షో లు చాలా ఫేమస్. 

స్పాటినిటీగా మాట్లాడటం,సెలబ్రెటీలతో తనకున్న పరిచయాలతో జోక్స్ వేయటంతో సరదాగా నడుపుతుంది. మరి తమన్నా అవన్ని చేయగలదా..ఇప్పటిదాకా వేరే వాళ్ల షోలలో తమన్నా కనిపించింది. ఇప్పుడు తమన్నా షోలో వేరే సెలబ్రెటీలు కనిపించబోతున్నారు. ఆమెతో నటించిన హీరోలతో ఆమె చిట్ చాట్ ఉంటుందంటున్నారు. రామ్ చరణ్, రవితేజ,అల్లు అర్జున్,  లాంటి స్టార్స్ కూడా ఈ టాక్ షో లో వస్తావని చెప్పుకుంటున్నారు. అదే కనుక జరిగితే షో పెద్ద హిట్ అవుతుంది. అరవింద్ ఆలోచన అద్బుతమవుతుంది. అలా కాకుండా చిన్న నటులను పిలిచి మాట్లాడటం మొదలెడితే, ఆహాలో వస్తున్న వెబ్ సీరిస్ లాగ  కష్టమే అంటున్నారు.

తమన్నా విషయానికి వస్తే..తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్‌లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్నారు తమన్నా. అయితే ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ లోకి ఎంట్రీ ఇస్తున్నారు తమన్నా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోన్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది.   

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌