మెట్రో` సినిమా స‌క్సెస్ మీట్!!

Published : Mar 19, 2017, 09:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
మెట్రో` సినిమా స‌క్సెస్ మీట్!!

సారాంశం

ఆర్.కె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మెట్రో మూవీ సక్సెస్ పై నిర్మాత సురేష్ కొండేటి సంతోషం సూర్య,మురుగదాస్ లాంటి ప్రముఖుల నుంచి మెట్రోకు ప్రశంసలు

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ తాళ్లూరి నిర్మించిన‌ `మెట్రో` చిత్రం  ఈ శుక్ర‌వారం విడుద‌లై విజ‌య‌వంతంగా ఆడుతోంది. చైన్ స్నాచింగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ సినిమాకు ప్రేక్ష‌కుల‌కు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో థియేట‌ర్ల‌ల‌లో దూసుకుపోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ హైద‌రాబాద్ లో ఆదివారం స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. 

ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ ` చాలా రోజుల త‌ర్వాత `మెట్రో` తో మంచి స‌క్సెస్ అందుకున్నాం.  ప్రేమిస్తే, జ‌ర్నీ , స‌లీమ్ త‌ర‌హాలో మంచి విజ‌యాన్ని అందుకుంది. తెలుగు ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని ఎంతో ఆద‌రిస్తున్నారు. సినిమాలో అంతా కొత్త వాళ్లైనా  ఇంత ఆద‌ర‌ణ ల‌భిస్తుందంటే కార‌ణం. అందులో ఉన్న కంటెట్ వ‌ల‌నే. మంచి క‌థాంశం ఉన్న చిత్రాలు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారని మ‌రోసారి నా విష‌యంలో ప్రూవ్ అయింది. అందుకు వారికి ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుతున్నా. ఈ సినిమా ఇంత  సక్సెస్ అయిందంటే  కార‌ణం  మీడియానే. సినిమా చూసి అన్ని వెబ్ సైట్లు మూడుకు పైగా రేటింగ్స్ ఇచ్చి సినిమాకు మ‌రింత బూస్ట్ నిచ్చాయి. ఈ చిత్రాన్ని `చుట్ట‌ల‌బ్బాయి` చిత్రం  నిర్మాత ర‌జ‌నీ రామ్, నేను కలిసి రైట్స్ ద‌క్కించుకున్నాం. ఇప్పుడు మా న‌మ్మ‌కం నిజ‌మైనందుకు సంతోషంగా ఉంది.  డైరెక్ట‌ర్  ఆనంద్ కృష్ణ ప్ర‌తీ స‌న్నివేశాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. కెమెరా, సినిమా టోగ్ర‌ఫీ ప‌నిత‌నం హైలైట్ గా నిలిచింది. ఆనంద్ కృష్ణ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని..శిరీష్ పెద్ద హీరో అవ్వాల‌ని కోరుకుంటున్నా`  అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ ` నా మొద‌టి సినిమానే తెలుగు, త‌మిళ్ లో పెద్ద విజ‌యం సాధించ‌డం చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన ద‌ర్శ‌కులు  ముర‌గ‌దాస్, గౌత‌మ్ మీన‌న్ ప్ర‌శంసించారు. ఆ అనుభూతి ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. చైన్ స్నాచింగ్ వాస్త‌వ సంఘ‌ట‌ల‌ను బేస్ చేసుకుని క‌థ సిద్దం చేశా. మొద‌ట్లో కొంచెం టెన్ష‌న్ ప‌డ్డా. కానీ అవుట్ ఫుట్ చూసుకుని స‌క్సెస్ అవుతాన‌ని కాన్ఫిడెన్స్ పెరిగింది.  ప్ర‌స్తుతం ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ స్టోరీని రెడీ చేస్తున్నా. తెలుగులో కూడా సినిమాలు చేయాల‌నుకుంటున్నా` అని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్