దీన స్థితిలో నటి పావలా శ్యామల, కాదంబరి కిరణ్ ఆర్దిక సాయం

By Mahesh JujjuriFirst Published Jan 5, 2024, 10:27 AM IST
Highlights

దీన స్థితిలో ఉన్న నటి పావలా శ్యామల మరోసారి వైరల్ న్యూస్ అయ్యారు. ఆర్ధిక పరిస్థితి బాగోలేక ఆశ్రమంలో జీవితం గడుపుతున్న ఆమెకు మేము సైతం ఆపన్న హస్తం అందించింది. 

టాలీవుడ్ నటి.. ఒకప్పటి కమెడియన్ పావలా శ్యామల గుర్తుండే ఉంటుంది. ఈమధ్య కాలంలో బాగా కాంట్రవర్షియల్ స్టేట్ మెంట్స్.. త పాటు.. తన ఆర్ధిక పరిస్థితి తో పాటు.. ఆరోగ్య పరిస్థితి  గురించి సోషల్ మీడియా ద్వారా ఏకరువు పెట్టిన నటి మరోసారి హైలెట్ అయ్యింది.   ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో.. స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకుని..  బిజీ లైఫ్ చూసిన శ్యామల ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉంది. 

అనారోగ్య కారణాలు.. వయసు సహకరించకపోవడంతో సినిమాల్లో నటించడం లేదు... అవకాశాలు కూడా రావడంలేదు శ్యామలకు. ఆమెతో పాటు.. శ్యామల కూతురు కూడా అనారోగ్యం బారిన పడటంతో.. ప్రస్తుతం వృద్ధాశ్రమంలో... అత్యంత  దీనస్థితిలో కాలం వెళ్ళదీస్తున్నారు. ఇక ఆమె గురించి గతంలో కూడా కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేక శీర్షికలు ప్రచురించాయి.. రీసెంట్ గా ఆమె  పరిస్థితిని  తెలుసుకున్న తెలుగు నటుడు కాదంబరి కిరణ్ ఆమెకు సహాయం అందించారు.

Latest Videos

కాందబరి కిరణ్ మనం సైతం  ఫౌండేషన్ ను రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.. పేదలకు తన ట్రస్ట్ ద్వారా సాయం అదిస్తూ.. ఇండస్ట్రీలో ప్రత్యేకం అనిపించుకున్నాడు. తన ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదకు సేవలు అందించాడు  కాదంబరి కిరణ్.. పావలా శ్యామల పరిస్థితిని ఓ మీడియా ద్వారా తెలుసుకొని ఆమెను వెతుకుంటూ వెళ్లి సహాయం అందించారు. హైదరాబాద్ శివారులో ఉన్న ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న శ్యామలను కలుసుకొని ఆమె 25,000 నగదు సాయాన్ని చెక్ రూపంలో ఆమెకు అందించారు. ఆమెకు మెరుగైన వైద్యం, క‌నీస అవ‌స‌రాలు తీర్చేలా సహాయం చేశారు.

పావల శ్యామల సీనియర్ నటి. ఆమె ఇండస్ట్రీలో దాదాపు నలబై ఏళ్లకు పైగా ఉంది.  ఎప్పుడో జంధ్యల సినిమాల్లో కూడా యంగ్ కమెడియన్ గా నటించింది  శ్యామల. అప్పటి నుంచి సినిమాలు చేస్తున్నా.. ఆర్ధికంగా నిలకడ లేక.. ఉన్న ఆస్తులు.. సంపాధించిన దంతా పోగొట్టుకుంది సీనియర్ నటి. తనతో పాటు.. తన కూతురు కూడా అనారోగ్యం పాలు అవ్వడం.. ఇంకాస్త కృంగదీసింది శ్యామలను. ఆమె పరిస్థితి తెలుసుకున.. పవర్ స్టార పవన్ కళ్యాణ్ తో పాటు.. పలువురు సినీ పెద్దలు గతంలో సాయం చేశారు. ఇక తాజాగా ఆమె  పరిస్థితిని తెలుసుకొని, ఆమెను వెతుకుంటూ వెళ్లి మరి సహాయం చేసిన కాదంబరి కిరణ్ ని నెటిజెన్స్ అభినందిస్తున్నారు. .

click me!