సిద్దమైన సైరా.. ఇంటర్వెల్ బ్యాంగ్ పై ఉత్కంఠ!

Published : Sep 29, 2019, 02:49 PM ISTUpdated : Sep 29, 2019, 02:50 PM IST
సిద్దమైన సైరా.. ఇంటర్వెల్ బ్యాంగ్ పై ఉత్కంఠ!

సారాంశం

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుంది. రీసెంట్ గా సెన్సార్ కట్ తో యూ/ఏ అందుకున్న  చిత్రం ఇప్పుడు అన్ని భాషల్లో డీటీఎస్ మిక్సింగ్ ను సైతం పూర్తి చేసుకుంది.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి సినిమా ఎట్టకేలకు అన్ని పనులు పూర్తి చేసుకుంది. రీసెంట్ గా సెన్సార్ కట్ తో యూ/ఏ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు అన్ని భాషల్లో డీటీఎస్ మిక్సింగ్ ను సైతం పూర్తి చేసుకుంది. అక్టోబర్ 2న తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది.

అసలు మ్యాటర్ లోకి వస్తే,, సినిమాకు సంబందించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. సురేందర్ రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలో సౌండ్ డిజైనర్ తపస్ నాయక్ కూడా ఉన్నాడు. అయితే అందులో మెగాస్టార్ ఒక కొండపై కూర్చొని ఉండగా ద వార్ బిగిన్స్ నౌ అని లైన్ కనిపిస్తోంది. చూస్తుంటే ఆ షాట్ ఇంటర్వెల్ కార్డ్ అయ్యి ఉండవచ్చని అనిపిస్తోంది. ఓక ప్రభుత్వ ఉద్యోగిని హతమార్చిన అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నొస్సం కోట దగ్గర యుద్ధ వాతావరణం మేలుకొంటుంది.  

అనంతరం బ్రిటిష్ సైన్యాల పీటలు కదిలేలా నరసింహారెడ్డి చేసిన పనులు ఏమిటి? ఆ తరువాత తెల్ల దొరలు ఎలాంటి అడుగులు వేస్తరు అనేది సినిమా క్లయిమ్యాక్స్ పై ఉత్కంఠను రేపనున్నాయట. అన్నిటికంటే ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాలో హైలెట్ అని తెలుస్తోంది. మరి సినిమా ఆడియెన్స్ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?