
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను తాజాగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ ను ఎన్నుకుని.. ప్రతీ ఒక్క సినిమా వ్యక్తి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డ్ లను ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఇందులో అత్యధికంగా మన తెలుగు సినిమాలకు 10 అవార్డ్ లు రాగా.. వారికి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ రాజకీయ ప్రముఖులు అవార్డ్ విన్నర్స్ ను విష్ చేస్తూ.. ట్వీట్లు చేస్తున్నారు.
తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. జాతీయ అవార్డ్ సాధించిన విన్నర్స్ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్. ప్రతీ ఒక్కరి పేరును ప్రస్తావిస్తూ.. ముఖ్యంగా మైడియర్ బన్నీ అంటూ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ సాధించిన అల్లు అర్జున్ కు.. మిగతావారికి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ బావా అంటూ.. గొప్ప ఘనతను సాధించిన నీకు తిరుగులేదంటూ.. ట్వీట్ చేశారు ఎన్టీఆర్.
ఇక దర్శకధీరుడు రాజమౌళి స్పెషల్ గా ట్వీట్ చేశారు. సిక్సర్ కొట్టామ్.. ఆర్ఆర్ఆర్ కు ఆరు జాతీయ అవార్డ్ లు లభించడం చాలా సంతోషం అన్నారు. ఆర్ఆర్ఆర్ నుంచి అవార్డ్ లు సాధించిన కీరవాణి, కాలభైరవ,ప్రేమ్ రక్షిత్, శ్రీనివాస్ మోహన్, సాల్మోన్ మాస్టార్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
అంతే కాదు అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డ్ సాధించడంపై కూడా ప్రత్యేకంగా స్పందించారు ఎస్ ఎస్ రాజమౌళి.. పుష్పరాజ్.. తగ్గేదేలే అంటూ ట్వీట్ చేసి ప్రత్యేకంగా విష్ చేశారు జక్కన్న.
జాతీయ అవార్డ్ విన్నర్స్ ను ప్రత్యేకంగా అభినందించారునందమూరి బాలకృష్ణ. ప్రతిష్ఠాత్మక 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను పొందిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరునా నా హృదయపూర్వక అభినందనలు అంటూ తెలిపారు బాలయ్య.
నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ నోట్ రిలీజ్ చేశారు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. ఆయన ఏమన్నారంటే.. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయి. పుష్ప చిత్రానికిగాను శ్రీ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన శ్రీ అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు అని అన్నారు. అటు ఆర్ ఆర్ఆర్ కు ఆరు అవార్డు రావడం ఎంతో గర్వకారణమంటూ.. జాతీయ స్థాయిలో అన్ని భాషల్లో అవార్డ్ పొందిన వారికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
అటు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా నేషనల్ అవార్డ్ పై స్పందించారు. ప్రత్యేకంగా అల్లు అర్జున్ పేరును ప్రస్తావిస్తూ.. కంగ్రాట్స్ అల్లు అర్జున్ అన్నా.. తగ్గేదే లే అంటూ ట్వీట్ చేశారు విజయ్. అంతే కాదు మరో ట్వీట్ లో నేషనల్ అవార్డ్ సాధించిన విన్నర్స్ అందరి పేర్లు ప్రస్ధావిస్తూ.. శుభాకాంక్షలు తెలిపారు విజయ్