మెగాస్టార్ అఫర్.. కొరటాలకు దూరమైన దేవి?

Published : Jun 27, 2019, 10:22 AM ISTUpdated : Jun 27, 2019, 10:24 AM IST
మెగాస్టార్ అఫర్.. కొరటాలకు దూరమైన దేవి?

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అనంతరం కొరటాల శివతో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సినిమాకు సంబందించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అనంతరం కొరటాల శివతో వర్క్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే సినిమాకు సంబందించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరటాల మొదటిసారి తనకు ఇష్టమైన టెక్నీషియన్ ని కూడా మెగాస్టార్ కోసం పక్కనెట్టేస్తున్నట్లు సమాచారం. 

మిర్చి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన దర్శకుడు కొరటాల శివ ఆ సినిమా ద్వారా దేవి శ్రీ ప్రసాద్ తో జర్నీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ సినిమా మ్యూజిక్ క్లిక్కవ్వడంతో ఆ తరువాత శ్రీమంతుడు - జనతా గ్యారేజ్ - భరత్ అనే నేను సినిమాలకు కూడా కొరటాల రాక్ స్టార్ తోనే మ్యూజిక్ చేయించుకున్నాడు. అయితే ఈ కాంబోకి మొదటిసారి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే సైరా సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదికి మెగాస్టార్ మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి ఫిదా అయిన చిరు నెక్స్ట్ కొరటాల శివ తో చేయబోయే సినిమాకు కూడా ట్యూన్స్ చేయాలనీ అఫర్ ఇచ్చేశాడు. దీంతో కోరటాల తన ఆస్థాన సంగీత దర్శకుడిని పక్కనెట్టక తప్పడం లేదు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.  

PREV
click me!

Recommended Stories

చికిరీలు గికిరీలు, ఇదేం కథ.. పెద్ది సినిమాపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి
Sobhan Babu `సోగ్గాడు` మూవీతో పోటీ పడి దెబ్బతిన్న ఎన్టీఆర్‌.. శివాజీ గణేషన్‌కైతే చుక్కలే