మహేష్ కి తల్లిగా మారిన స్టార్ హీరోయిన్!

Published : Aug 21, 2018, 06:20 PM ISTUpdated : Sep 09, 2018, 12:35 PM IST
మహేష్ కి తల్లిగా మారిన స్టార్ హీరోయిన్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. గడ్డంతో ఉన్న మహేష్ బాబు లుక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలానే మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ జయప్రద కూడా కనిపించబోతుందని సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ కి తల్లి పాత్రలో జయప్రద దర్శనమివ్వబోతుందని వినికిడి. ఆమె పాత్ర తెరపై ఎక్కువసేపు కనిపించకపోయినా.. ఆ ఇంపాక్ట్ మాత్రం ఉండేలా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జయప్రద రాజకీయాల్లో బిజీ అవ్వడంతో సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు నటిగా బిజీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ ధారావాహికలో నటించడానికి అంగీకరించారు. ఇక ఇప్పుడు మహేష్ సినిమాతో టాలీవుడ్ లో బిజీ అవ్వాలనుకుంటోంది!

PREV
click me!

Recommended Stories

Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే