చిరు ఆ మూవీలో నటించడం వెంకీకి నచ్చలేదట.. నేను నటించి ఉంటే బ్లాక్ బస్టర్ అని తిడుతూ..

By tirumala ANFirst Published Jan 1, 2024, 4:45 PM IST
Highlights

విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఉంది. సందర్భం వచ్చిన ప్రతి సారి చిరు వెంకీ ఎంతో ఆప్యాయంగా ఉంటారు.విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. 

విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి మధ్య మంచి బాండింగ్ ఉంది. సందర్భం వచ్చిన ప్రతి సారి చిరు వెంకీ ఎంతో ఆప్యాయంగా ఉంటారు.విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

జనవరి 13న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ముందు నుంచి ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ కెరీర్ లో ఇది మైలురాయి మూవీ కావడంతో సెలెబ్రేటింగ్ వెంకీ 75 పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. 

Latest Videos

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. వెంకటేష్ తో ఉన్న అనుబంధాన్ని చిరు ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. వెంకీ హీరోగా మరకముందే అతడిని చూసినట్లు చిరు చెప్పారు. తనకి కాంపిటీషన్ అవుతాడని అప్పడే ఊహించినట్లు చిరు సరదాగా పేర్కొన్నారు. 

అయితే వెంకటేష్ ఒక సందర్భంలో తనని విమర్శించిన సంగతిని కూడా చిరు గుర్తు చేసుకున్నారు. తాను డాడీ చిత్రంలో నటించడం వెంకటేష్ కి నచ్చలేదని చిరంజీవి అన్నారు. డాడీ మూవీ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది. ఆ మూవీ నా ఇమేజ్ కి అంతగా సెట్ కాలేదనేది వెంకటేష్ ఒపీనియన్. నాకు ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాడు. 

డాడీ మూవీలో కూతురి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే చిత్రంలో తాను నటించి ఉంటే సూపర్ హిట్ అయి ఉండేదని వెంకటేష్ నాతో అన్నాడు. అలాంటి సెంటిమెంట్ మూవీస్ లో తానూ బాగా పండిస్తానని వెంకటేష్ చెప్పినట్లు చిరు గుర్తు చేసుకున్నారు. 

click me!