అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లి.. సంబరాల్లో మెగాఫ్యామిలీ

First Published Jul 7, 2018, 2:10 PM IST
Highlights

మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనకు అనిందిత్ కజిన్ కావడంతో మొదటి నుండి ఆమె ఈ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు నమ్రత, లావణ్య త్రిపాఠి, ప్రగ్యాజైస్వాల్ వంటి తారలు హాజరయ్యారు

అక్కినేని అఖిల్.. డిజైనర్ శ్రియా భూపాల్ ను ప్రేమించిన సంగతి తెలిసిందే. నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. కానీ ఊహించని విధంగా పెళ్లి క్యాన్సిల్ అయింది. దీంతో అఖిల్ సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే శ్రియా మాత్రం మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు అనిదింత్ రెడ్డితో ఏప్రిల్ లో శ్రియకు ఎంగేజ్మెంట్ జరిగింది.

గత కొద్దిరోజులుగా ప్రీవెడ్డింగ్, మెహందీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పెళ్లి వేడుకతో ఈ జంట ఒక్కటైంది. శుక్రవారం వీరి వివాహం జరిగింది. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య అయిన ఉపాసనకు అనిందిత్ కజిన్ కావడంతో మొదటి నుండి ఆమె ఈ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది.

ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు నమ్రత, లావణ్య త్రిపాఠి, ప్రగ్యాజైస్వాల్ వంటి తారలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

 

click me!