
హీరోగా రవితేజ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు ఫన్, యాక్షన్ తో కలిసి ఉంటాయి. ఏ కథ చెప్పినా అందులో కాస్తంత వెటకారం,సెటైర్ తో కూడిన ఫన్ వర్కవుట్ చేస్తూంటాడు. అలాగే ఇప్పుడు ఆయన ఓ సినిమాని తన రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఆ సినిమా కూడా అలాంటిదే అని అర్దమవుతోంది. రీసెంట్ గా రిలీజైన ఈ చిత్రం ట్రైలర్ ఆ విషయం చెప్పకనే చెప్తోంది. వివరాల్లోకి వెళితే..
తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ నటించిన `గట్ట కుస్తీ` తెలుగులో `మట్టి కుస్తీ` పేరుతో విడుదలవుతోంది. చెల్ల అయ్యవు ఈ చిత్రానికి దర్శకుడు. ఆర్.టి టీమ్ వర్క్స్- విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ లపై మాస్ మహారాజా రవితేజ సమర్పణలో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్,ఫన్ తో నింపారు. డైలాగులు జనాలకు బాగా ఎక్కుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో చెప్పే డైలాగు పెళ్లయ్యాక మొగడుతో కుస్తీ పట్టాల్సిందే అని హీరోయిన్ తో చెప్పే డైలాగు జనాలకు బాగా పట్టేసింది.
తన గ్రామంలో జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తున్న విష్ణు విశాల్ తన మామను పెళ్లాడేందుకు పద్ధతైన అమ్మాయిని చూడమని అడుగుతాడు. కానీ కోరుకున్నదానికి విరుద్ధంగా జరగడమే అతడి విధి. వీధుల్లో రౌడీలను పరిగెత్తించి తన్నే ఐశ్వర్య లక్ష్మి తో అతగాడికి లంకె వేశాక ఏం జరిగింది? అన్నది తెరపైనే చూడాలి. తాజా ట్రైలర్ లో కుస్తీలు ఒకవైపు కామెడీలు మరోవైపు.. ఇందులోనే వేడెక్కించే రొమాన్స్ ఆద్యంతం రక్తి కట్టిస్తున్నాయి. రొమాంటిక్ యాంగిల్‌ని కొంత సరదాగా ట్రైలర్ లో చూపించారు.
విష్ణు - ఐశ్వర్య వైవాహిక జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో వారి స్నేహితులు వివరించే తీరు బోలెడంత కామెడీ కురిపిస్తోంది. ఇక కుస్తీలు పట్టాలంటే కావాల్సింది కసి! అంటూ పంచ్ లైన్ లతో మూవీ గ్రిప్పింగ్ గానే తెరకెక్కిందని అర్థమవుతోంది. ఒక సామాన్య యువకుడైన విష్ణు విశాల్ జీవితంలో ఎదురైన సవాల్ ని స్వీకరించి కసిగా రెజ్లింగ్ కోసం శిక్షణపై దృష్టి సారిస్తాడు. స్పోర్ట్స్ పర్శన్ గా అతడు ఫెరఫెక్ట్ గా సూటయ్యాడు. ట్రైలర్ మొత్తం ఆట, ఫన్, శృంగారంతో ఆకట్టుకుంది. మట్టి కుస్తి (తమిళంలో గట్ట కుస్తి)కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. రిచర్డ్ ఎం నాథన్ కెమెరా వర్క్ అందించారు.
డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వీవీ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో రవితేజ భాగస్వాములు అయ్యారు. చెల్లా అయ్యావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డియర్ కామ్రేడ్, రాధే శ్యామ్ లాంటి సినిమాలకు సంగీతాన్ని అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు కూడా స్వరాలందిస్తున్నారు. విష్ణు విశాల్ ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘మోహన్ దాస్’ అనే మరో థ్రిల్లర్ సినిమాలోనూ విష్ణు విశాల్ నటిస్తున్నారు.