'బరువు తగ్గి షూటింగ్ కి వస్తా'.. మారుతికి చెప్పిన మెగా హీరో!

Published : Mar 13, 2019, 12:27 PM ISTUpdated : Mar 13, 2019, 12:28 PM IST
'బరువు తగ్గి షూటింగ్ కి వస్తా'.. మారుతికి చెప్పిన మెగా హీరో!

సారాంశం

తనదైనశైలిలో కామెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న దర్శకుడు మారుతి. అయితే ఆయన తాజా చిత్రం శైలజా రెడ్డి డిజాస్టర్ అవటంతో కాస్త వెనకబడ్డారు. నానితో సినిమా అనుకున్నా ముందుకు వెళ్లలేదు. 

తనదైనశైలిలో కామెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న దర్శకుడు మారుతి. అయితే ఆయన తాజా చిత్రం శైలజా రెడ్డి డిజాస్టర్ అవటంతో కాస్త వెనకబడ్డారు. నానితో సినిమా అనుకున్నా ముందుకు వెళ్లలేదు. వేరే హీరోలుతో కథలు చేద్దామనుకున్నా అందరికీ డేట్స్ ప్లాబ్లం తో లేటు అయ్యేటట్లు ఉంది. ఈ నేపధ్యంలో మెగా హీరో సాయి ధరమ్ తేజకు కథ చెప్పి ఒప్పించారని సమాచారం. చిత్ర లహరి చిత్రం తర్వాత ఈ  ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది. 

అయితే చిత్ర లహరి చిత్రం కోసం సాయి ధరమ్ తేజ మొత్తం తన లుక్ ని మార్చుకున్నారు. కాస్త బరువు పెరిగి కనపడుతున్నారు. దాంతో చిత్రలహరి పూర్తి స్దాయి షూటింగ్ అయ్యాక..రెండు నెలలు టైమ్ తీసుకుని బరువు తగ్గి కనపడతానని సాయి చెప్పినట్లు సమాచారం. అప్పటికి మారుతి తన స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉంటారు. సినిమా పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంటో తో సాగుతుందని, భలే భలే మొగాడివోయ్ స్దాయి ఫన్ తో కథ ఉండబోతోందని చెప్తున్నారు. 

వేసవిలో అఫీషియల్ గా ఈ చిత్రం లాంచ్ కానుంది. వరసగా ఆరు ప్లాఫ్ ల తర్వాత సాయి ధరమ్ తేజ ..చిత్ర లహరి సినిమాతో తిరిగి ఫామ్ లోకి వస్తానని భావిస్తున్నారు. మారుతి సైతం తను ఈ సినిమా తో మళ్లీ పాత మారుతిని చూస్తారని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. చిత్రలహరి హిట్ అయ్యితే మారుతి సినిమాకు బాగా ప్లస్ అవుతుంది. బిజినెస్ కూడా బాగా జరుగుతుందనటంలో సందేహం లేదు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?