మానుషి చిల్లర్ కు అతనితో నటించాలనుందట

Published : Feb 10, 2018, 05:42 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
మానుషి చిల్లర్ కు అతనితో నటించాలనుందట

సారాంశం

మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్స్ అమీర్ తో ఫస్ట్ సినిమా చేయాలనుందన్న మానుషి

మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అంటే తనకెంతో ఇష్టమని, అతనితో నటించాలని వుందని తన ఆసక్తిని వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో అమీర్ తన ఫేవరెట్ అని మానుషి స్పష్టం చేసింది. ఇటీవలే మిస్ వరల్డ్ గా ఎంపిక అయిన ఈ భారతీయ సుందరి.. తన తదుపరి లక్ష్యం సినిమాలే అని స్పష్టం చేసింది. ఇది వరకూ ప్రపంచ, విశ్వసుందరులుగా నిలిచిన భారతీయ మహిళలు సినిమాల్లో బిజీ అయిపోయినట్టే తను కూడా సినిమాలు చేయాలనుకుంటున్నట్టుగా మానుషి ప్రకటించింది.

సినిమాలు చేయడం మొదలుపెట్టి.. ఆమిర్ ఖాన్ తో నటించడమే తన డ్రీమ్ అని మానుషి అంటోంది. ఆమీర్ తోనే ప్రత్యేకంగా ఎందుకు? అంటే.. ఆ హీరో సినిమాలు గొప్పగా ఉండటమే గాక, సందేశాత్మకంగా కూడా ఉంటాయని చెప్పింది. నటిగా తనకు ప్రియాంక చోప్రా ఇష్టం అని మానుషి చెప్పింది.

తాజాగా ఒక పత్రిక కవర్ పేజీ కోసం కోసం మానుషీ చిల్లర్ ఫోటో షూట్ లో పాల్గొంది. అందులో భాగంగా ఈ హాట్ పోజులను ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు