#Ponniyinselvan:'పొన్నియిన్‌ సెల్వన్‌' OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Published : Oct 25, 2022, 10:40 AM IST
#Ponniyinselvan:'పొన్నియిన్‌ సెల్వన్‌'  OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారు

సారాంశం

సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌజ్‌ ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విక్రమ్‌, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిషలాంటి భారీ స్టార్‌ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా గత రికార్డులను తిరగరాస్తుంది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.


పొన్నియిన్‌ సెల్వన్‌.. ఈ సినిమా తెలుగులో వర్కవుట్ కాలేదు కానీ...తమిళంలో సృష్టిస్తోన్న సంచలనాలకు ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు రికార్డులను తిరగరాస్తోంది. సెప్టెంబర్‌ 30న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ హౌజ్‌ ఫుల్‌ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. విక్రమ్‌, జయంరవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిషలాంటి భారీ స్టార్‌ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమా గత రికార్డులను తిరగరాస్తుంది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకొని రికార్డు కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. అయితే అదే సమయంలో ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ ఫిక్స్ అయ్యింది.

అందుతున్న సమాచారం మేరకు...ఈ చిత్రం అమేజాన్ ప్రైమ్ లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటిటిలో తెలుగు,తమిళ,కన్నడ వెర్షన్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఓటిటి లో కూడా భారీగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. 
 
ఇక తమిళ నాట అయితే ఈ ఏడాదిలో మరో బిగ్గెస్ట్ హిట్ గా ఈ చిత్రం నిలిచి భారీ గ్రాసర్ గా నిలిచింది.తమిళనాడులో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కమల్‌ హాసన్‌ హీరోగా వచ్చిన విక్రమ్‌ సినిమా రికార్డులను సైతం బ్రేక్‌ చేయడం విశేషం మరి తమిళ్ లోనే కాకుండా యూఎస్ లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు నమోదు చేయడం విశేషం. తమిళ్ వెర్షన్ నుంచి అయితే టోటల్ గా 6 మిలియన్ మార్క్ ని యూఎస్ లో అందుకోడమే పెద్ద సెన్సేషన్ అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం 6.5 మిలియన్ మార్క్ ని టచ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. 

బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో దీపావళి వరకు ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు మణి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. విక్రమ్, కోబ్రా మూవీ తర్వాత భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాను పూర్తిగా రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు డైరెక్టర్ మణిరత్నం. త్వరలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ