50 దేశాల్లో హిస్టారికల్ మణికర్ణిక..!

By Prashanth MFirst Published Jan 24, 2019, 8:24 PM IST
Highlights

ఇండియన్ హిస్టారికల్ సినిమాల్లో ఒకటైన మణికర్ణిక మొత్తానికి విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ సినిమా ఎండింగ్ కు వచ్చేసరికి డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఝాన్సీ లక్ష్మి బాయ్ పాత్రలో నటించిన కథానాయిక కంగనా రనౌత్ సినిమాను తన డైరెక్షన్ లో ఎండ్ చేసి రిలీజ్ కు సిద్ధం చేసింది. 

ఓ వైపు హిందూ సంఘాల ఆరోపణలు ఎదురవుతున్నప్పటికీ ధీటుగా సమాధానం చెప్పి మరోసారి తాను ఎవ్వరికి భయపడను అని నిరూపించింది. ఇక 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించిన మణికర్ణిక తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది. మొత్తంగా 50 దేశాల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. చూస్తుంటే మొదటి రోజు కంగనా సినిమా ఓపెనింగ్స్ ను గట్టిగా అందుకునేలా ఉందని ఎనలిస్ట్ లు చెబుతున్నారు. 

సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వరల్డ్ వైడ్ గా ఈ హిస్టారికల్ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ ను ఈజీగా టచ్ చేయగలదని చెబుతున్నారు. మరోవైపు బాలీవుడ్ లో శివ సేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే బయోపిక్ థాక్రే కూడా రిలీజ్ కాబోతోంది. 

click me!