వంద రోజుల తరువాత ఇంటికి.. ఆనందంలో మంచు ఫ్యామిలీ

Published : Jun 11, 2020, 05:11 PM IST
వంద రోజుల తరువాత ఇంటికి.. ఆనందంలో మంచు ఫ్యామిలీ

సారాంశం

లాక్‌ డౌన్‌కు కొన్ని వారల ముందు విరానిక సింగపూర్ వెళ్లింది. ఈ లోగా ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం పెరిగిపోవటంతో మనదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ లాక్‌ డౌన్‌ విధించారు. దీంతో విరానికా ఇంటి రాలేని పరిస్థితి ఏర్పడింది. మంచు విష్ణు ఇండియాలో ఉండటం విరానికా ఒంటరిగా నలుగురు పిల్లలతో సింగపూర్‌లో ఉండిపోవటంతో కాస్త ఇబ్బంది పడింది.

లాక్‌ డౌన్‌ కారణంగా సామాన్య ప్రజలే కాదు, ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన ప్రముఖులు ఇళ్లు చేరే దారిలేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్ల తీశారు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది మంచు ఫ్యామిలీ పెద్ద కోడలు, విష్ణు భార్య విరానికా. లాక్‌ డౌన్‌కు కొన్ని వారల ముందు విరానిక సింగపూర్ వెళ్లింది. ఈ లోగా ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం పెరిగిపోవటంతో మనదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ లాక్‌ డౌన్‌ విధించారు.

దీంతో విరానికా ఇంటి రాలేని పరిస్థితి ఏర్పడింది. మంచు విష్ణు ఇండియాలో ఉండటం విరానికా ఒంటరిగా నలుగురు పిల్లలతో సింగపూర్‌లో ఉండిపోవటంతో కాస్త ఇబ్బంది పడింది. అయితే ఎప్పటికప్పుడు తన పరిస్థితిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటునే ఉంది విరానికా. తాజాగా లాక్‌ డౌన్‌ నుంచి అన్ని దేశాలు సడలింపులు ఇస్తుండటంతో మంచు వారి కోడలు ఇంటికి చేరనుంది.

గత వారం మంచు విష్ణు, సింగపూర్‌ నుంచి ఓ ప్రత్యేక విమానం ఇండియాకు రాబోతుంది అని ట్వీట్ చేశాడు. అయితే ఇప్పుడు అదే ఫ్లైట్‌లో తన పిల్లలతో కలిసి ఇండియాకు తిరిగి వస్తోంది విరానికా. మరికొద్ది గంటల్లోనే ఈమె ఇంటికి చేరనుంది. దాదాపు వంద రోజుల తరువాత మంచు వారి కోడలు సొంత ఇంటికి చేరనుండటంతో వారి కుటుంబమంతా ఆనందంగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?