మంచు విష్ణు కుమార్తె పేరు ఇదే.. అద్భుతంగా ఉందంటున్న ఫ్యాన్స్!

Published : Aug 29, 2019, 04:32 PM ISTUpdated : Aug 29, 2019, 11:06 PM IST
మంచు విష్ణు కుమార్తె పేరు ఇదే.. అద్భుతంగా ఉందంటున్న ఫ్యాన్స్!

సారాంశం

మంచు విష్ణు, విరోనికా దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. వీరికి ఇది నాలుగో సంతానం. ఇప్పటికే మంచు విష్ణు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. 

మంచు విష్ణు, విరోనికా దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన సంగతి తెలిసిందే. వీరికి ఇది నాలుగో సంతానం. ఇప్పటికే మంచు విష్ణు దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు. తన భార్య నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. 

తాజాగా విష్ణు తన చిన్న కుమార్తెకు పేరు పెట్టాడు. తన కుమర్తె పేరు 'ఐరా విద్య మంచు' అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. లిటిల్ ఏంజిల్ ని తలపించేలా ఉన్న తన కుమార్తె ఫోటోని కూడా మంచు విష్ణు షేర్ చేశాడు. పేరు చాలా బావుందంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

మంచు విష్ణు దంపతులకు మొదట ఆవియానా, విరియానా కవలపిల్లలు జన్మించారు. ఇక గత ఏడాది జనవరి 1న విరోనికా బాబుకు జన్మనిచ్చింది. తన కొడుక్కి అవ్రం భక్త మంచు అని విష్ణు పేరు పెట్టాడు. విష్ణు తన పిల్లలకు ఎ, వి ఆంగ్ల అక్షరాలతోనే పేర్లు పెట్టడం విశేషం. 

 

PREV
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు