సుప్రీంకోర్టుకు మంచు విష్ణు, కారణం ఏంటో తెలుసా?

Published : May 28, 2025, 05:43 PM IST
manchu vishnu

సారాంశం

మంచు విష్ణుకు ఇబ్బందులు తప్పడంలేదు. వరుస వివాదాలు, కేసులతో పాటు.. రీసెంట్ గా కన్నప్ప సినిమా వల్ల కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు విష్ణుకి. ఇక తాజాగా మంచు హీరో సుప్రీమ్ కోర్డును ఆశ్రయించారు. ఎందుకంటే?

 

సినీ నటుడు మంచు విష్ణు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసును రద్దు చేయాలంటూ న్యాయస్తానాన్ని వేడుకున్నారు. ఈ కేసు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయనపై నమోదయ్యింది. ఈ కేసు నుంచి తనను తప్పించాలని మంచు విష్ణు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై మంగళవారం (మే 28, 2025) సుప్రీంకోర్టు ప్రధాన విచారణ చేపట్టింది. జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పరిశీలించి, కేసులో ఉన్న ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను 2025 జూలై 15వ తేదీకి వాయిదా వేసింది.

2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే, ఆ ఆరోపణలు నిరాధారమైనవని, తాను ఏ విధంగానూ ఎన్నికల నియమాలు ఉల్లంఘించలేదని మంచు విష్ణు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం, ముందు దశలో ఉన్నత న్యాయస్థానాల్లో జరిగిన న్యాయ ప్రక్రియల పర్యవేక్షణను పరిగణలోకి తీసుకుని, తదుపరి విచారణ వరకు అన్ని పక్షాలను ఆహ్వానించేందుకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.

ఈ కేసు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూలై 15న జరిగే తదుపరి విచారణలో పూర్తి వివరాలు, తగిన ఆధారాల సమీక్ష అనంతరం సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చే అవకాశం ఉంది. ఈమధ్యనే కుటుంబంలో ఆస్తి గొడవలతో మంచు కుటుంబం అంతా సమస్యలు ఫేస్ చేసింది. అటు కన్నప్ప సినిమా కంట్రవర్సీల వల్ల కూడా మంచు విష్ణుకు తలనొప్పులు తప్పడంలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌