Manchu Manoj: రెండో పెళ్లి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన మంచు మనోజ్‌.. రేపే అనౌన్స్ మెంట్‌

Published : Jan 19, 2023, 07:27 PM IST
Manchu Manoj: రెండో పెళ్లి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసిన మంచు మనోజ్‌.. రేపే అనౌన్స్ మెంట్‌

సారాంశం

మంచు మనోజ్‌ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు. 

మంచు మోహన్‌బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్‌.. రెండో పెళ్లి వార్తలు చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఇప్పటికే మొదటి భార్యకి విడాకులిచ్చి ఒంటరిగా ఉంటున్నారు. గతేడాది వినాయక చవితి రోజు భూమా మౌనికతో కలిసి కనిపించింది. మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి చిన్నకూతురు మౌనిక. వీరిద్దరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని, సహజీవనం చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. మంచు మనోజ్‌ ఇంట్లోనే మౌనిక ఉంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే శుభవార్త చెబుతానని తెలిపారు మంచు మనోజ్‌. ఆ మధ్య దర్గాని సందర్శించిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇక బుధవారం ఓ ట్వీట్‌ చేశాడు. తన హృదయానికి సంబంధించిన, తన జీవితంలోని ఓ ప్రత్యేకమైన వార్తని తెలియజేయబోతున్నట్టు వెల్లడించారు. జీవితంలో కొత్త ఫేజ్‌లోకి ఎంటర్‌ అయ్యేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నానని, శుక్రవారం(జనవరి 20, 2023) రోజున ఈ ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు మంచు మనోజ్‌. తాజాగా ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. లేటెస్ట్ గా మరో ట్వీట్‌ చేస్తూ, `ముహూర్తం ఫిక్స్. రేపు ఉదయం 9.45 నిమిషాలకు ఈ ప్రకటన ఉండబోతుందని వెల్లడించారు. మీ ఆశీస్సులు కావాలని తెలిపారు మంచు మనోజ్‌. 

రేపు ఉదయం ఆయన తన సెకండ్‌ మ్యారేజ్‌ ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. భూమా మౌనికతో వివాహం చేసుకోబోయే విషయాన్ని ఇక అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు మ్యారేజ్‌ చేసుకోబోతున్నారనేది మనోజ్‌ వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ రచ్చ చేస్తుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మొత్తానికి సస్పెన్స్ కి వీడబోతుంది అని, అభినందనలు తెలియజేస్తున్నారు. 

మంచు మోహన్‌బాబు తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మనోజ్‌. బాలనటుడిగా అలరించారు. `2005లో `శ్రీ` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. పదికిపైగానే సినిమాలు చేశారు. హీరోగా ఆకట్టుకున్నారు. కానీ సక్సెస్‌ లేకపోవడంతో ఆయన కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు వైవాహిక జీవితం సెట్‌ కాలేదు. 2015లో ఆయన తన ప్రియురాలు ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. నాలుగేండ్లకే(2019)లో విడిపోయారు. ఆ తర్వాత సింగిల్‌గా ఉంటున్న ఆయన ఇప్పుడు భూమా మౌనికతో ప్రేమలో పడి ఆమెని పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే భూమా మౌనికకి కూడా మ్యారేజ్‌ అయ్యింది. అతనితో విడాకులిచ్చి ఆమె కూడా సింగిల్‌గానే ఉంటుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్