తండ్రి పుట్టిన రోజు సందర్భంగా మంచు మనోజ్ (Manchu Manoj) ఎమోషనల్ గా విషెస్ తెలిపారు. తమ పెళ్లి సందర్భంలోని ఆ ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగపు మాటలతో పోస్ట్ పెట్టారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు (Mohan Babu) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. అలాగే కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ గానూ బిరుదులు పొందారు. నటనతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకున్నారు. ఇవ్వాళ ఆయన పుట్టిన రోజు కావడం విశేషం. 1952 మార్చి 19న తిరుపతిలో జన్మించారు. నేటితో 70వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మంచు వారి కుటుంబ సభ్యుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అభిమానులు మోహన్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబుకు ఎమోషనల్ గా విషెస్ తెలపడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల భూమా మౌనికా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్న మనోజ్ తన పెళ్లి సందర్భంలో బాగా వైరల్ అయిన ఫొటోను పంచుకుంటూ తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈఫొటో మోహన్ బాబును పట్టుకొని మౌనికా రెడ్డి కృతజ్క్షత భావంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ ఫొటోను షేర్ చేస్తూ.. ‘నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!’ చాలా ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
మార్చి 3న భూమా మౌనికా రెడ్డితో మంచు మనోజ్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మౌనికా రెడ్డి - మనోజ్ వివాహం జరిగింది. వీరి పెళ్లికి మంచు లక్ష్మి పెద్దగా మారింది. పెళ్లికి మోహన్ బాబు కూడా హాజరై ఈ జంటను ఆశీర్వదించారు. అప్పటి ఫొటోనే మనోజ్ తాజాగా షేర్ చేస్తూ విషెస్ తెలపడం ఆసక్తికరంగా మారింది. పెళ్లి తర్వాత మనోజ్ మళ్లీ తన కేరీర్ పైనే ఫోకస్ పెట్టారని చెప్పారు. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో నటిస్తున్నారు.