Manchu Manoj: మంచు మనోజ్ ఛీటింగ్... పెళ్లి సంగతి తుస్, అసలు విషయం ఇదే!

Published : Jan 20, 2023, 10:30 AM ISTUpdated : Jan 20, 2023, 11:09 AM IST
Manchu Manoj: మంచు మనోజ్ ఛీటింగ్... పెళ్లి సంగతి తుస్, అసలు విషయం ఇదే!

సారాంశం

జనవరి 18న మనోజ్ ఒక కీలక ప్రకటన చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. 20వ తేదీ 9:45 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశాను. నా జీవితంలోని మరో అంకానికి సంబంధించిన స్పెషల్ న్యూస్ అన్నారు.


రెండు రోజులుగా ఊరించి ఉసూరుమనిపించాడు మంచు మనోజ్. ఏదో ఏనుగు సామెతను గుర్తు చేశాడు. కొత్త జీవితం, నూతన అధ్యాయం అంటూ జనాలను ఉహల్లో విహరింపజేశాడు. చివరికి తుస్సు మనిపించాడు. కొన్ని నెలలుగా మంచు మనోజ్ రెండో వివాహం చేసుకోబుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. భూమా మౌనికతో ఆయన సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో ఇద్దరికీ వివాహం అంటూ... కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మౌనిక-మనోజ్ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో మంచు మనోజ్ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. 

జనవరి 18న మనోజ్ ఒక కీలక ప్రకటన చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. 20వ తేదీ 9:45 నిమిషాలకు ముహూర్తం ఫిక్స్ చేశాను. నా జీవితంలో మరో అంకానికి సంబంధించిన స్పెషల్ న్యూస్ అన్నారు. జీవితం, కాకరకాయ అంటుంటే పెళ్లి గురించే కాబోలు అనుకున్నారందరు. ఎటూ మౌనికతో వివాహం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తేనని భావించారు. అనూహ్యంగా మనోజ్ కొత్త మూవీ ప్రకటన చేశారు. 
 

వాట్ ది ఫిష్ టైటిల్ తో అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్టర్ వరుణ్ కోరుకొండ వాట్ ది ఫిష్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సిక్స్ సినిమాస్, ఏ ఫిల్మ్ బై బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. డార్క్ కామెడీ, థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వాట్ ది ఫిష్ తెరకెక్కుతోందని సమాచారం. మొత్తంగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని తెలివిగా వాడుకొని కొత్త మూవీ ప్రకటన చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే ఛీటింగ్ స్క్రీన్ ప్లే జనాల మీద ప్రయోగించాడు. 

కాగా గతంలో మనోజ్ అహం బ్రహ్మస్మి టైటిల్ తో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. అది జరిగి ఏళ్ళు గడిచిపోయింది. నేడు కొత్త మూవీ ప్రకటించారు. ఈ క్రమంలో అహం బ్రహ్మస్మి అటకెక్కినట్లేనని అర్థం అవుతుంది. ఇక 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రం హీరోగా మనోజ్ చివరిగా కనిపించారు. తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో కామియో రోల్స్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Anasuya : మానసికంగా వేధిస్తున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పరువు తీస్తున్నారు.. 42 మందిపై అనసూయ పరువునష్టం కేసు..
బాలకృష్ణ అలా పిలుస్తారని అస్సలు ఊహించలేదు.. షాకింగ్ నిజాలు చెప్పిన నటుడు