పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్, మౌనిక దంపతులు.. ఆ కోలాహలం చూశారా, వీడియో

Published : Apr 14, 2024, 09:33 PM ISTUpdated : Apr 14, 2024, 09:34 PM IST
పాపతో ఇంటికి చేరుకున్న మంచు మనోజ్, మౌనిక దంపతులు.. ఆ కోలాహలం చూశారా, వీడియో

సారాంశం

శనివారం రోజు భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో మంచు మనోజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. 

మంచు వారి చిన్నబ్బాయి మనోజ్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్ సినిమా చేసి చాలా కాలమే అవుతోంది. కానీ పర్సనల్ లైఫ్ తో మనోజ్ మీడియాలో, సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు. ఆ మధ్యన మంచు మనోజ్ భూమా మౌనికని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం మనోజ్, మౌనిక అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఆ మధ్యన మౌనిక గర్భవతి అయిన సంగతి తెలిసిందే. అయితే శనివారం రోజు భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీనితో మంచు మనోజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. 

ఇక నేడు భూమా మౌనిక పాపతో కలసి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయింది. దీనితో మనోజ్ దగ్గరుండి భార్య బిడ్డని ఇంటికి తీసుకువచ్చాడు. తొలిసారి పాపతో మౌనిక, మనోజ్ ఇంటికి రావడంతో అక్కడ కోలాహలం నెలకొంది. దిష్టి తీసి ఇంట్లోకి తల్లి బిడ్డని ఆహ్వానించారు. 

 

ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు మనోజ్ తన భార్య బిడ్డ విషయంలో ఎంతో కేరింగ్ గా ఉన్నాడు. కనీసం వారిపై ఈగ కూడా వాలనంత కేరింగ్ చూపిస్తున్నాడు మంచు మనోజ్. 

దీనితో అభిమానులు తండ్రి అంటే అంతే మరి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మంచు మనోజ్.. భూమా మౌనిక రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ తొలి పెళ్లి అయ్యాక తమ పార్ట్నర్స్ నుంచి విడాకులు పొందారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం