'అరుంధతి' మొదటి ఛాయిస్ ఎవరో తెలిస్తే షాకే!

Published : May 07, 2019, 10:45 AM IST
'అరుంధతి' మొదటి ఛాయిస్ ఎవరో తెలిస్తే షాకే!

సారాంశం

దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన హిట్ చిత్రాల్లో 'అరుంధతి' ఒకటి.

దర్శకుడు కోడి రామకృష్ణ రూపొందించిన హిట్ చిత్రాల్లో 'అరుంధతి' ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో అనుష్క రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయింది. అనుష్క లేకపోతే అరుంధతి లేదు అన్నట్లుగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.

ఈ సినిమా తరువాత టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది అనుష్క. అయితే నిజానికి 'అరుంధతి' కోసం హీరోయిన్ గా మొదట మంచు లక్ష్మీని అనుకొన్నారట. ఆమె అమెరికాలో ఉండడంతో డేట్స్ కుదరక ఆ పాత్ర చేయలేకపోయారు. ఒకానొక దశలో మమతా మోహన్ దాస్ ను కూడా సంప్రదించింది చిత్రబృందం.

క్యాన్సర్ కారణంగా ఆమె సినిమా చేయలేనని చెప్పడంతో అప్పుడు అనుష్కని తీసుకున్నారు. అయితే అనుష్క ఎంపిక అంత సులువుగా జరగలేదట. జేజెమ్మ పాత్రకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ప్రత్యేకంగా తయారు చేయించి వాటిని అనుష్క ధరించిన తరువాత బాగుందని మెచ్చుకుంటే అప్పుడు సెట్ కి వెళ్లారట.

తీరా అక్కడకు వెళ్లిన తరువాత కథ ప్రకారం అనుకున్న సెట్ కు, డిజైన్ చేయించిన దుస్తులకు సరిపోకపోవడంతో వాటిని పక్కన పెట్టేసి కొత్త కాస్ట్యూమ్స్ ని తయారు చేయించారు. దీనికోసం మూడు, నాలుగు నెలల సమయం తీసుకున్నారు. ఆ తరువాతే అనుష్కని ఫైనల్ చేశారు. తెరపై అనుష్క తన నట విశ్వరూపంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్
చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి