అలాంటి షోలు చూడను.. మంచు లక్ష్మీ కామెంట్స్!

Published : Sep 21, 2019, 08:09 AM ISTUpdated : Sep 21, 2019, 11:04 AM IST
అలాంటి షోలు చూడను.. మంచు లక్ష్మీ కామెంట్స్!

సారాంశం

తాజాగా మరో షోని హోస్ట్ చేయడానికి సిద్ధమైంది. అదే 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్'. త్వరలోనే ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. 

నటిగా ఎన్నో సినిమాలు చేసిన మంచు లక్ష్మీ ఆ తరువాత హోస్ట్ గా బుల్లితెరపై కొన్ని షోలు చేసింది. తాజాగా మరో షోని హోస్ట్ చేయడానికి సిద్ధమైంది. అదే 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్'. త్వరలోనే ఈ షో టెలికాస్ట్ కానుంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది.

ఇప్పటివరకు తను చేసిన షోలలో 'ఫీట్ అప్ విత్ ది  స్టార్స్' భిన్నమైందని.. ఈ షో కోసం స్టార్స్ ని కలిసినప్పుడు నైట్ డ్రెస్ రావాలని చెబితే కొందరు ఆశ్చర్యపోయారని.. కొందరు ఉత్సాహం చూపించారని చెప్పింది. బాలీవుడ్ లో ఇలాంటి షోలు సాధారణమేనని ఈ షోకి హోస్ట్ గా తనను ఎన్నుకున్నారంటే ఎంతో బాధ్యతతో చేయగలననే నమ్మకమేనని చెప్పుకొచ్చింది.

ఇది రియాలిటీ షో కాదని.. చక్కని ఫన్ గేమ్ లాంటిదని చెప్పింది. ఈ షోని ముందుగా తనకు తెలిసిన సెలబ్రిటీలతో మొదలుపెట్టినట్లు.. అందరినీ ఈ షోలో కలుసుకోవాలనుందని  చెప్పింది. ప్రత్యేకంగా ఎవరినీ ఇష్టం అని చెప్పలేను కానీ రానాని బాగా మిస్ అవుతున్నట్లు చెప్పింది. వెబ్ సిరీస్ లో ఎక్కువగా చూస్తుంటాను కానీ బుల్లితెరపై జరుగుతున్న రియాలిటీ షోలు మాత్రం చూడనని  వెల్లడించింది. 

PREV
click me!

Recommended Stories

Tollywood Senior Heroes: దసరా నుంచి సంక్రాంతి వరకు, క్యూ కట్టిన సీనియర్ హీరోలు..300 కోట్లు కొట్టే బొమ్మ ఏది ?
Panchanama Review: ఉదయభాను నిర్మించిన 'పంచనామా' సిరీస్ రివ్యూ.. ఒక్క క్లూతో కూపీ మొత్తం లాగిన పోలీస్