
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరోసారి ఉత్తమ నటుడిగా నిలిచారు. ఆయన కేరళా ప్రభుత్వం ప్రకటించిన 55వ రాష్ట్ర చలన చిత్ర అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. త్రిస్సూర్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక మంత్రి సాజి చెరియన్ ఈ అవార్డులను ప్రకటించారు. 'భ్రమయుగం' చిత్రంలోని నటనకు గాను మమ్ముట్టి ఉత్తమ నటుడిగా మమ్ముట్టి ఎంపిక కావడం విశేషం. ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ ని కూడా విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మమ్ముట్టి 'కొడుమన్ పొట్టి' అనే పాత్రను పోషించారు.
బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం పోటీ పడ్డ ఆసిఫ్ అలీ, విజయరాఘవన్, టోవినో థామస్, సౌబిన్‌లను వెనక్కి నెట్టి మమ్ముట్టి ఉత్తమ నటుడిగా నిలవడం విశేషం. అలాగే ఉత్తమ నటిగా షమ్లా హాస ఎంపికయ్యారు. 'ఫెమినించి ఫాతిమా'లోని నటనకుగానూ షమ్లా ఈ అవార్డు వరించింది. 'నడన్న సంభవం' చిత్రంలోని నటనకు లిజోమోల్ సహాయ నటిగా ఎంపికయ్యారు. సౌబిన్ (మంజుమ్మల్ బాయ్స్), సిద్ధార్థ్ భరతన్ (భ్రమయుగం) ఉత్తమ సహాయ నటులుగా నిలిచారు. జ్యోతిర్మయి (బొగైన్‌విల్లా), దర్శన రాజేంద్రన్ (ప్యారడైజ్), టోవినో (ఏఆర్‌ఎం), ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం)లకు ప్రత్యేక జ్యూరీ ప్రశంసలు లభించాయి.
చిదంబరం దర్శకత్వం వహించిన 'మంజుమ్మల్ బాయ్స్' ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ చిత్రంతో సహా 'మంజుమ్మల్ బాయ్స్' 10 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ కళా దర్శకుడు, ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ సౌండ్ డిజైన్, ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్ అవార్డులు కూడా ఈ మూవీకి దక్కడం విశేషం. ఈ మూవీ తెలుగులో విడుదలై విశేష ఆదరణ పొందింది. అలాగే తెలుగు ఆడియెన్స్ ని మెప్పించిన `ప్రేమలు`కి సైతం అత్యంత ప్రజాదరణ పొందిన మూవీగా అవార్డు దక్కడం విశేషం.
కేరళా 55వ స్టేట్ అవార్డుల లిస్ట్ చూస్తే.
ఉత్తమ సినీ పుస్తకం - పెణ్పాట్టు తారకళ్ (సి.ఎస్. మీనాక్షి)
ఉత్తమ సినీ వ్యాసం - మరయున్న నలుకెట్టుకళ్ (డా. వల్సన్ వాతుస్సేరి)
ప్రత్యేక జ్యూరీ అవార్డు సినిమా - ప్యారడైజ్ (దర్శకత్వం ప్రసన్న విత్తనాగే)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - జితిన్ లాల్, ఆల్బర్ట్, అనిత ముఖర్జీ (ఏఆర్‌ఎం)
ఉత్తమ నూతన దర్శకుడు - ఫాజిల్ మహమ్మద్ (ఫెమినించి ఫాతిమా)
ప్రజాదరణ పొందిన చిత్రం - ప్రేమలు
డాన్స్ మాస్టర్ - సుమేష్ సుందర్ (బొగైన్‌విల్లా)
డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫీమేల్) - సయనోర ఫిలిప్ (బరోజ్)
డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్) - ఫాసి వైక్కం (బరోజ్)
కాస్ట్యూమ్స్ - సమీరా సనీష్ (రేఖాచిత్రం, బొగైన్‌విల్లా)
మేకప్ ఆర్టిస్ట్ - రోనెక్స్ జేవియర్ (బొగైన్‌విల్లా, భ్రమయుగం)
కలరిస్ట్ - శ్రీక్ వారియర్ (మంజుమ్మల్ బాయ్స్, బొగైన్‌విల్లా)
సౌండ్ డిజైన్ - షిజిన్ మెల్విన్ (మంజుమ్మల్ బాయ్స్)
సింక్ సౌండ్ - అజయన్ అడాట్ (పని)
కళా దర్శకత్వం - అజయన్ చాలిస్సేరి (మంజుమ్మల్ బాయ్స్)
ఎడిటర్ - సూరజ్ ఇ.ఎస్ (కిష్కింధ కాండం)
నేపథ్య గాయని - సెబా టామీ (అం అ)
నేపథ్య గాయకుడు - హరి శంకర్ (ఏఆర్‌ఎం)
నేపథ్య సంగీతం(బ్యాక్ గ్రౌండ్ స్కోర్) - క్రిస్టో జేవియర్ (భ్రమయుగం)
సంగీత దర్శకుడు - సుషిన్ శ్యామ్
గీత రచయిత - వేదన్ (వియర్ప్ తున్నియిట్ట కుప్పాయం) - మంజుమ్మల్ బాయ్స్
సినిమాటోగ్రఫీ - షైజు ఖాలిద్ (మంజుమ్మల్ బాయ్స్)
స్క్రీన్‌ప్లే - చిదంబరం (మంజుమ్మల్ బాయ్స్)
ఉత్తమ కథా రచయిత - ప్రసన్న విత్తనాగే (ప్యారడైజ్)
సహాయ నటి - లిజోమోల్ (నడన్న సంభవం)
సహాయ నటులు - సౌబిన్ (మంజుమ్మల్ బాయ్స్), సిద్ధార్థ్ భరతన్ (భ్రమయుగం)
దర్శకుడు - చిదంబరం (మంజుమ్మల్ బాయ్స్)
ఉత్తమ రెండవ చిత్రం - ఫెమినించి ఫాతిమా
ఉత్తమ చిత్రం - మంజుమ్మల్ బాయ్స్
ప్రత్యేక జ్యూరీ ప్రశంస (నటన) - జ్యోతిర్మయి (బొగైన్‌విల్లా)
ప్రత్యేక జ్యూరీ ప్రశంస (నటన) - దర్శన రాజేంద్రన్ (ప్యారడైజ్)
ఉత్తమ నటి - షమ్లా హంస (ఫెమినించి ఫాతిమా)
ప్రత్యేక జ్యూరీ ప్రశంస - టోవినో (ఏఆర్‌ఎం)
ప్రత్యేక జ్యూరీ ప్రశంస - ఆసిఫ్ అలీ (కిష్కింధ కాండం)
ఉత్తమ నటుడు - మమ్ముట్టి (భ్రమయుగం)