వైఎస్ఆర్ బయోపిక్ లో విజయమ్మగా మమ్ముట్టి సరసన క్రేజీ హిరోయిన్

First Published 8, Mar 2018, 10:01 PM IST
Highlights
  • వై.ఎస్.ఆర్.బయోపిక్ కి సన్నాహాలు
  • ప్రధాన పాత్రలో మమ్ముట్టి 
  • దర్శకుడిగా మహి వి. రాఘవ్    

ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆనందో బ్రహ్మ' సినిమాతో హిట్ కొట్టిన మహి వి.రాఘవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.రాజశేఖర్ రెడ్డి పాత్రకోసం మమ్ముట్టిని సంప్రదించగా ఆయన సుముఖతను వ్యక్తం చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆయన భార్య పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన దర్శక నిర్మాతలు, నయనతారను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. మలయాళంలో మమ్ముట్టి .. నయనతార కాంబినేషన్లో వచ్చిన 'భాస్కర్ ది రాస్కెల్ ' .. పుతియా నియమం' సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇంకో వైపున ఈ ఇద్దరితోను సంప్రదింపులు జరగలేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

 

Last Updated 25, Mar 2018, 11:52 PM IST