సినిమా ఇండస్ట్రీలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే స్టార్లలో మమ్ముట్టి ఒకరు. ఆయన డైట్, వ్యాయామం గురించి చాలా మంది చెప్తుంటారు. హెల్త్ కేర్ విషయంలో మమ్ముట్టి చాలా మందికి స్ఫూర్తి. ఇప్పుడు మమ్ముట్టి డైట్ సీక్రెట్స్ ని డైటీషియన్ నతాష మోహన్ రివీల్ చేశారు. సోషల్ మీడియాలో మమ్ముట్టితో ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఆయన డైట్ గురించి చెప్పారు.
మమ్ముట్టి లైఫ్ స్టైల్ నుంచి స్ఫూర్తి పొందిన డైట్ ప్లాన్ టిప్స్ అంటూ ఆమె ఇలా చెప్పారు...
1. బ్యాలెన్స్డ్ డైట్: ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ప్రతి భోజనంలోనూ ఉండాలి.
2. నీళ్ళు: మమ్ముట్టి ఎప్పుడూ బాడీ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటారు. రోజంతా బోలెడు నీళ్ళు తాగుతారు. పండ్లు, కూరగాయలు కూడా తింటారు.
3. న్యూట్రిషన్: ఎక్కువ న్యూట్రిషన్, యాంటీఆక్సిడెంట్స్ కోసం రంగురంగుల పండ్లు, కూరగాయలు తింటారు.
4. ఫుడ్ కంట్రోల్: మితంగా తినడం చాలా ముఖ్యం. టేస్ట్ తగ్గించకుండానే హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఇది సహాయపడుతుంది.
5. పూర్తి ఆహారం: మంచి ఎనర్జీ కోసం, మొత్తం హెల్త్ కోసం పూర్తిగా ప్రాసెస్ చేయని ఆహారం తినాలి. పంచదార, జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి.
6. రెగ్యులర్ ఫుడ్: ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, ఆకలిని కంట్రోల్ చేయడానికి సరైన సమయానికి తినాలి.
7. మైండ్ ఫుల్ ఈటింగ్: ఆస్వాదిస్తూ తినాలి. ఆకలి సిగ్నల్స్ ని గమనించి ప్రతి భోజనాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇది జీర్ణక్రియకి మంచిది.
8. యాక్టివ్ లైఫ్ స్టైల్: మంచి ఫలితాల కోసం మంచి డైట్ తో పాటు రెగ్యులర్ వ్యాయామం కూడా అవసరం. మమ్ముట్టి అలా చేస్తారు. అంటే డైట్ తో పాటు వ్యాయామం కూడా ముఖ్యం. అందుకే మమ్ముట్టి ఏడు పదులు దాటినా ఇంకా 30ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తుంటాడు.