“మాలికాపురం” ott స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Published : Feb 16, 2023, 07:53 PM IST
“మాలికాపురం” ott స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

సారాంశం

ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ చిత్రం ‘మలికాపురం’ సినిమాను జనవరి 21 ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడీ చిత్రం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.


రీసెంట్ గా మళయాళంలో వచ్చి భారీ హిట్ గా నిలిచిన చిత్రమే “మాలికాపురం”. టాలెంటెడ్ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ చిత్రం “కాంతారా” ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగులో వచ్చింది.  అయితే ఈ చిత్రం ఇక్కడ పెద్దగా  సక్సెస్ కాలేదు. ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది.  మళయాళం, తమిళం, హిందీ, కన్నడ,తెలుగు భాషల్లో  స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

చిత్రం కథ విషయానికి వస్తే...తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్  హీరోగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలనటులు శ్రీపత్, దేవానంద ప్రధాన పాత్రలు పోషించారు. కోట్లాది మంది అయ్యప్ప భక్తులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఉన్ని ముకుందన్ ఇదివరకే తెలిపారు.
 
మలయాళంలో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు దీనిని నిర్మించాయి. అంటోన్ జోసెఫ్ యాజమాన్యంలోని యాన్ మెగా మీడియా మరియు వేణు కున్నపిల్లి యాజమాన్యంలోని కావ్య ఫిల్మ్ కంపెనీ నిర్మాణ భాగస్వాములు. “మాలికాపురం” చిత్రం లో చిన్నపిల్లల నటన నిజంగా మెస్మరైజింగ్ గా ఉంటుంది. అలాగే కీలక పాత్రలో కనిపించిన ఉన్ని ముకుందన్ ఆకట్టుకుంటారు.
 
నరయం, కున్హికూనన్, మిస్టర్ బట్లర్, మంత్రమోతీరం వంటి చిత్రాలతో ఫేమస్ అయిన దర్శకుడు శశిశంకర్ తనయుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎడిటర్- షమీర్ మహ్మద్, కెమెరామెన్- విష్ణు నారాయణన్ నంబూతిరి. పతం వళవ్, నైట్ డ్రైవ్, కడవర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత అభిలాష్ పిళ్లై స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది.ఈ సినిమా గీతా  ఫిలిం డిస్ట్రిబ్యూషన్  ద్వారా జనవరి 21 చేసారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?