విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

Published : Oct 25, 2018, 04:57 PM IST
విడాకులు తీసుకున్న నటితో కుర్రహీరో పెళ్లి..?

సారాంశం

తమకంటే వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అభిషేక్ బచ్చన్, ధనుష్ ఈ కోవలోకే వస్తారు. తాజాగా హాలీవుడ్ సింగర్, నటుడు నిక్ జోనాస్ తనకంటే పదేళ్లు పెద్దదైన ప్రియాంక చోప్రాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు

తమకంటే వయసులో పెద్ద అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అభిషేక్ బచ్చన్, ధనుష్ ఈ కోవలోకే వస్తారు. తాజాగా హాలీవుడ్  సింగర్, నటుడు నిక్ జోనాస్ తనకంటే పదేళ్లు పెద్దదైన ప్రియాంక చోప్రాని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.

వీరందరి స్టోరీ ఒకటైతే.. ఓ యంగ్ హీరో ఏకంగా విడాకులు తీసుకున్న పిల్లల తల్లిని పెళ్లి చేసుకోబోతున్నాడని టాక్. అతడెవరంటే.. అర్జున్ కపూర్. చాలా రోజులుగా అర్జున్ కపూర్.. మలైకా అరోరా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.

నటుడు అర్భాజ్ ఖాన్ నుండి మలైకా విడాకులు తీసుకోవడానికి గల కారణం కూడా అర్జున్ కపూర్ తో ప్రేమ వ్యవహారమనే అంటారు. విడాకులు తీసుకున్న తరువాత మలైకా పబ్లిక్ ఈవెంట్స్ కి అర్జున్ కపూర్ తో కలిసి వస్తోంది. వీకెండ్స్ లో కూడా ఈ జంట మీడియా కంట పడుతూనే ఉంది. తాజాగా వీరిద్దరూ కలిసి మిలాన్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు.

ఇద్దరూ ఒకరి చేయి మరొకరు పట్టుకొని మరి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పెద్ద వయసు అమ్మాయిని చేసుకోవడం కామనే అయినా.. మరీ పిల్లలున్న నలభై ఏళ్ల ఆంటీని కుర్ర హీరో ఇంతగా ప్రేమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని బాలీవుడ్ మీడియా వర్గాలు కథనాలను ప్రచురిస్తున్నారు.
  

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు