బాలకృష్ణ విగ్గుల కోసం ఎంత ఖర్చు చేస్తారో తెలుసా..? ఖర్చంతా వారిదేనా..?

By Mahesh JujjuriFirst Published Apr 25, 2023, 11:26 AM IST
Highlights

బాలకృష్ణ సినిమా అంటే.. వెంటనే గుర్తుకువచ్చే వాటిలో ఆయన హెయిర్ స్టైల్ కూడా ఒకటి. బలయ్యకు మొదటి నుంచి విగ్గులు వాడటం అలవాటు. ఆయన విగ్గుల కోసం ఎంత కాస్ట్ పెడతారో తెలుసా..? బలయ్య విగ్గుల స్పెషల్ ఏంటంటే..? 

ఇప్పటి హీరోలు పెద్దగా వాడటంలేదు కాని.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా సీనియర్ హీరోలంతా.. సినిమాల కోసం స్పెషల్ గా విగ్గులు వాడినవారే.. వాడుతున్నవారే. ఇప్పుడు హీరోలంటే.. జుట్టు పెంచుకుని.. హెయిర్ స్టైల్ సినిమాలకు తగ్గట్టుగా చేసుకుంటారు. ఇక హీరోల విగ్గుల విషయంలో బాలకృష్ణ విగ్గులు చాలా స్పెషల్ అంటున్నాడు బాలయ్య మేకప్ మెన్ వాసు. ఫిల్మీ ఫోకస్ కథనం ప్రకారం బాలయ్య విగ్గులు స్పెషల్ గా ఉంటాయన్నారు. 

ప్రతీ సినిమాలో బాలయ్య బాబు విగ్గు వాడతారు. ఆయన విగ్గు గురించి బలకృష్ణ పర్సనల్ మేకప్ మెన్ వాసు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసు కొప్పిశెట్టి బాలకృష్ణ విగ్గుల గురించి మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. బాలయ్య సాధారణమైన విగ్గులు వాడరన్నారు. అవి క్వాలిటీవి.. కాస్ట్లీవి అయ్యి ఉండాలన్నారు వాసు. 

Latest Videos

గతంలో బాలకృష్ణ గారి కోసం ముంబై లేదా చెన్నై నుంచి విగ్గులు తెప్పించేవారమని.. అయితే ఇప్పుడు ఆ విగ్గులు హైదరాబాద్ లో కూడా దొరుకుతున్నాయి అన్నారు. ఇక్కడ కూడా  ఎన్నో రకాల విగ్గులు దొరుకుతున్నాయని వాసు వెల్లడించారు. బాలకృష్ణ వాడే విగ్గులు చాలా కాస్ట్లీవంట.. నాసిరకం విగ్గులు ఆయన ఉపమోగించరు.. విగ్గుల కోసం లక్షల్లో బాలయ్య ఖర్చు పెడుతుంటారట.  

అయితే సినిమాలో బాలకృష్ణ తన పాత్ర కోసం విగ్గు వాడితే మాత్ర .. ఆ విగ్గులు రకరకాలుగా మార్చాల్సి ఉంటుంది. ఆ విగ్గుల ఖర్చు అంతా నిర్మాతలే భరిస్తారని అంటున్నారు వాసు. అయితె ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది.  బాలకృష్ణ సినిమాలలో విగ్ సెంటిమెంట్ కూడా ఉందని... ఆయన సినిమాలో  విగ్గు కనుక సెట్ అయితే సినిమా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ పై కూడా ఆయన స్పందించారు. 

ఇక బాలయ్య విగ్గు సెంటిమెంట్ గురించి కూడా వాసు మాట్లాడుతూ..  బాలకృష్ణ  గారు అలాంటివి నమ్మరని అన్నారు. అయితే విగ్గు బాగా ఉంటేనే బాలయ్య అందంగా కనిపిస్తారు.. అందుకే ఒక వేళ అలా సెంటిమెంట్ రూమర్ వచ్చి ఉంటుంది. అయితే బాలయ్య సినిమాల్లో మాత్రం ఆయన విగ్గు స్పెషల్ గా ఉంటుంది అన్నారు వాసు.  ఇక బాలయ్య రీసెంట్ గా నటించిన వీరసింహారెడ్డిలో కూడా బాలయ్య విగ్గు హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు బాలయ్య.. ఈమూవీ హిట్ కొడితే.. బాలయ్య ఖాతాల హ్యాట్రిక్ హిట్ పడినట్టే. 

click me!