Sarkaru Vaari Paata: పోటెత్తిన మహేష్‌ అభిమానులు.. థియేటర్ అద్దాలు ధ్వంసం..

Published : May 02, 2022, 10:11 PM IST
Sarkaru Vaari Paata: పోటెత్తిన మహేష్‌ అభిమానులు.. థియేటర్ అద్దాలు ధ్వంసం..

సారాంశం

`సర్కారు వారి పాట` ట్రైలర్‌ ఈవెంట్‌ కోసం మహేష్‌ బాబు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ట్రైలర్‌ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయగా, మధ్యాహ్నం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు.

మహేష్‌ బాబు నుంచి వస్తోన్న కొత్త చిత్రం `సర్కారు వారి పాట`. ఫుల్‌ మాస్‌, క్లాస్‌ మేళవింపుగా దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. `గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న చిత్రమిది. కీర్తిసురేష్‌ కథానాయికగా నటించింది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్లస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ నేడు(మే 2)న విడుదలైంది. హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్ లో ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. 

ఈ ట్రైలర్‌ ఈవెంట్‌ కోసం మహేష్‌ బాబు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ట్రైలర్‌ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయగా, మధ్యాహ్నం నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు.  దీంతో భ్రమరాంబ థియేటర్‌ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయింది. అభిమాన హీరో చిత్ర ట్రైలర్‌ని పెద్ద తెరపై చూసి ఎంజాయ్‌ చేయాలనుకున్నారు. కానీ ఊహించని కంటే ఎక్కువగా, థియేటర్‌లో పట్టలేనంతంగా జనం రావడంతో అక్కడ మొత్తం కిక్కిరిసిపోయింది. అభిమానులతో పోటెత్తిపోయింది.

అయితే ఈక్రమంలో అభిమానులు థియేటర్‌లోకి తోసుకెళ్లారు. దీంతో థియేటర్‌ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పొచ్చు. ఓ వైపు ట్రైలర్‌ దుమ్ములేపుతుంది. బీజీఎం మోత, మహేష్‌ మాస్‌ డైలాగ్‌లతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. దీంతో ఆగలేక అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చివరికి థియేటర్‌ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో కొంత మంది అభిమానులు గాయపడినట్టు సమాచారం. 

ఇక ఇప్పటికే విడుదలై టీజర్‌, ఈ చిత్రంలోని రెండు పాటలు విశేష ఆదరణ పొందాయి. దాదాపు వంద మిలియన్స్ రీచ్‌ అయ్యాయి. ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. దాన్ని తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ఈ నెల 12న థియేటర్లో మాస్‌ జాతర సాగనుందని చెప్పొచ్చు. మే 12న ఈ సినిమా విడుదల కాబోతుంది. అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని ట్రైలర్‌ స్పష్టం చేసింది. దీంతో ఇక మహేష్‌ ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?