SVP Trailer: మహేష్ నోట... జగన్ డైలాగు.. చెప్చించటం వెనక, కారణం?

Published : May 02, 2022, 05:44 PM IST
SVP Trailer: మహేష్ నోట... జగన్ డైలాగు.. చెప్చించటం వెనక, కారణం?

సారాంశం

మరో ప్రక్క ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు తరచూ చెప్పే డైలాగ్‌ను మహేష్ నోటి వెంట వినపడటం ...జగన్ ఫ్యాన్స్ కు పండగలా ఉంది. సోషల్ మీడియాలో అదే రచ్చగా ఉంది. ఈ డైలాగు  అనిపించడం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’అంటూ తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుకున్న ఈ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఎన్నికల్లో ఆయనకు అఖండ విజయాన్ని సాధించినపెట్టింది. ఇప్పుడు అదే డైలాగుని మహేష్ బాబు చెప్పారు. దాంతో పొలిటికల్ టచ్ వచ్చినట్లైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై మహీ వీ రాఘవ్ తెరకెక్కించిన యాత్ర సినిమాలోనూ ఈ డైలాగ్ ఉంది. ఆ సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే కావాలనే జగన్ మాటలని డైలాగుగా  చెప్పించారా..లేక సరదాగా సినిమాకు హైప్ కోసం, చర్చ జరగటం కోసం ఈ డైలాగు పెట్టారా అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారింది. 

మరో ప్రక్క ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అంటూ ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు తరచూ చెప్పే డైలాగ్‌ను మహేష్ నోటి వెంట వినపడటం ...జగన్ ఫ్యాన్స్ కు పండగలా ఉంది. సోషల్ మీడియాలో అదే రచ్చగా ఉంది. ఈ డైలాగు  అనిపించడం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ నేపథ్యంలో సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మహేశ్ బాబు బాడీ లాంగ్వేజ్ కి తగిన డైలాగులు సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 'అప్పుడే మీకు పెళ్లేంటి సార్' అని వెన్నెల కిశోర్ అంటే, 'అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా .. దీనమ్మా మెయింటెయిన్ చేయలేక దూల తీరిపోతోంది' అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ పేలింది.

మహేశ్ - కీర్తి మధ్య  లవ్ ట్రాక్  .. మహేశ్ - వెన్నెల కిశోర్ మధ్య కామెడీ ట్రాక్ .. మహేశ్ - సముద్రఖని మధ్య సవాల్ సీన్స్ ఒక రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. నదియా కీలకమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో,  పోసాని .. తనికెళ్ల భరణి .. సుబ్బరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

PREV
click me!

Recommended Stories

4 ఆటలతో 3 ఏళ్లు నాన్ స్టాప్ గా ఆడిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ఏదో తెలుసా?
Spirit లో విజయ్‌ దేవరకొండ ? పాత్ర ఇదేనా.. వామ్మో బాక్సాఫీసు షేక్ అయ్యే మ్యాటర్‌