Mahesh: ఎలక్ట్రిక్‌ ఆడి కార్‌ కొన్న మహేష్‌.. దాని స్పెషాలిటీ తెలిస్తే షాకే?

Published : Apr 17, 2022, 08:14 AM IST
Mahesh: ఎలక్ట్రిక్‌ ఆడి కార్‌ కొన్న మహేష్‌.. దాని స్పెషాలిటీ తెలిస్తే షాకే?

సారాంశం

ఇప్పటికే మహేష్‌బాబు వద్ద లగ్జరీ కార్లు బెంజ్‌, రేంజ్‌ రోవర్‌, బీఎండబ్ల్యూ కార్లున్నాయి. తాజాగా మరో మోడ్రన్‌, లగ్జరీ కారు చేరింది. ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేశారు మహేష్‌.

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కార్ల జాబితాలో మరో అధునాతన కారు చేరింది. ఇండియాలో కొత్తగా లాంచ్‌ అయిన ఆడి సంస్థకి చెందిన ఎలక్ట్రిక్‌ ఎస్‌యువీ కారుని ఆయన కొనుగోలు చేశారు. ఆడి ఈ-ట్రాన్‌ మోడల్‌కి చెందిన ఎలక్ట్రిక్‌ కారుని మహేష్‌ సొంతం చేసుకున్నారు. తాజాగా ఈ కారుని తన హ్యాండోవర్‌ చేసుకుంటూ దిగిన ఫోటోని పంచుకున్నారు మహేష్‌. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ చేతుల మీదుగా మహేష్‌ ఈ కారుని అందుకున్నారు. 

అంతేకాదు ఈ కారుకి ఆయన పెయిడ్‌ పార్టనర్‌ షిప్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రమోట్‌ చేస్తుండటం విశేషం. ఇక ఆడి ఈ ట్రాన్‌ ఎలక్ట్రిక్‌ కారు స్పెషాలిటీ చూస్తే, ఇది పూర్తి ఎలక్ట్రిక్‌ వాహనం. ఆడి సంస్థ ఫస్ట్ టైమ్‌ ఇండియాలో దీన్ని లాంచ్‌ చేసింది. గతేడాది ఆడి సంస్థ దీన్ని లాంచ్‌ చేశారు. దీన్ని మహేష్‌ బుక్‌ చేసుకున్నారు. కాగా ఈ కారుని శనివారం మహేష్‌ బాబుకి హ్యాండోవర్‌ చేశారు. 

ఈ ఆడి ఈ ట్రోన్‌ కారు ధర కోటి రూపాయలు. ఎక్స్ షోరూం ప్రైజ్‌ రూ.1.14కోట్ల వరకు ఉంది. ఈ కారు బ్యాటరీ సామర్థ్యం 95కిలో వాట్స్. 402హార్స్ పవర్స్ తో 6640 ఎన్‌ఎం టార్క్ ని అందిస్తుంది. ఇది కేవలం 5.7సెకన్లలో వంద కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకుంటుంది. కారు గరిష్ట వేగం 190కిలోమీటర్లు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 484 కిలోమీటర్లు దూరం ప్రయాణం చేస్తుంది. 

ప్రస్తుతం మహేష్‌బాబు రేంజ్‌రోవర్‌ కారుని వాడుతున్నారు. దీంతోపాటు ఆయన వద్ద మెర్సడేస్‌ జీఎల్‌ఎస్‌ 350డీ మోడల్‌, మెర్సిడేజ్‌ జీఎల్‌ క్లాస్‌ 450 మోడల్‌ బెంజ్‌కార్లు, టోయోటో ల్యాండ్‌ క్యూయిజ్‌, బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ కార్లున్నాయి. తాజాగా ఆడి ఎలక్ట్రిక్‌ కారు చేరింది. 

నటుడిగా సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం మహేష్‌బాబు `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కీర్తిసురేష్‌ కథానాయిక. ఇది మే 12న విడుదల కానుంది. దీంతోపాటు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అలాగే రాజమౌళితో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయనున్నారు మహేష్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Venu Swamy: అయ్యో, వేణు స్వామి పూజ వృధాగా పోయిందిగా.. అఖండ 2 వాయిదాతో మరోసారి ట్రోలింగ్