అరుదైన సీన్‌.. ఒకేతెరపై మహేష్‌, రణ్‌వీర్‌ సింగ్‌.. ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ

Published : Dec 26, 2020, 02:32 PM IST
అరుదైన సీన్‌.. ఒకేతెరపై మహేష్‌, రణ్‌వీర్‌ సింగ్‌.. ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ

సారాంశం

మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ లను ఒకే తెరపై పక్క పక్కన చూడబోతున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. వీరిద్దరని చూసేది వెండితెరపై కాదు, బుల్లితెరపై. మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ కలిసి ఫస్ట్ టైమ్‌ ఓ యాడ్‌ చేశారు. 

మహేష్‌బాబు.. తెలుగు సూపర్‌ స్టార్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌. వీరిద్దరు కలిసి తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే. వారి ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అలాంటి అరుదైన దృశ్యం కనిపించబోతుంది. మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ లను ఒకే తెరపై పక్క పక్కన చూడబోతున్నారు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. వీరిద్దరని చూసేది వెండితెరపై కాదు, బుల్లితెరపై. 

మహేష్‌బాబు, రణ్‌వీర్‌ సింగ్‌ కలిసి ఫస్ట్ టైమ్‌ ఓ యాడ్‌ చేశారు. థంమ్స్ అప్‌ యాడ్‌ చేశారు. దీనికి కోసం వీరిద్దరు కలిసి నటించారు. డీ గ్లామర్‌ లుక్‌లో, సాహసాలు చేశారు. థంమ్స్ అప్‌ యాడ్‌ కోసం పోరాడారు. అయితే ఇది చాలా ఆనందాన్నిచ్చిందని ఇద్దరు హీరోలు చెబుతున్నారు. ఈ మేరకు ఇన్‌ స్టా స్టోరీలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించడంతోపాటు అభినందించుకున్నారు. మహేష్‌ని రణ్‌వీర్‌ బిగ్‌ బ్రదర్‌గా అని చెప్పగా, మహేష్‌ కూడా ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో విశేషంగా వైరల్‌ అవుతుంది. 

ఇక మహేష్‌బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో కీర్తిసురేష్‌ హీరోయిన్‌. అలాగే రణ్‌వీర్‌ సింగ్‌ `83`లో నటిస్తున్నారు. కపిల్‌దేవ్‌ బయోపిక్‌ చిత్రమిది. దీంతోపాటు `సూర్యవంశీ`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. అలాగే `జయేష్‌భాయ్‌ జోర్దార్‌` అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్
తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?