మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ చేసుకున్న సింగర్‌ సునీత.. ఎప్పుడంటే?

By Aithagoni Raju  |  First Published Dec 26, 2020, 1:59 PM IST

ఇప్పటికే సింగర్స్ కి పెద్ద పార్టీ ఇచ్చింది సునీత. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఈ పార్టీలో హీరో నితిన్‌, యాంకర్‌ సుమ, రేణు దేశాయ్‌ వంటి వారు కూడా పాల్గొన్నారు. అయితే వీరి వివాహం కొన్ని రోజుల పాటు వాయిదా పడిందనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా డేట్‌ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. 


ప్రముఖ గాయని సునీత్‌ రెండో పెళ్లికి సిద్దమైన విషయం తెలిసిందే. ఆమె ప్రముఖ డిజిటల్‌ మీడియా అధినేత రామ్‌ వీరపనేనిని వివాహం చేసుకోబోతుంది. ఇటీవల వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. తాజాగా ఈ రోజు రాత్రి(శనివారం) సినీ ప్రముఖులకు ప్రీ వెడ్డింగ్‌ పార్టీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే సింగర్స్ కి పెద్ద పార్టీ ఇచ్చింది సునీత. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఈ పార్టీలో హీరో నితిన్‌, యాంకర్‌ సుమ, రేణు దేశాయ్‌ వంటి వారు కూడా పాల్గొన్నారు. 

అయితే వీరి వివాహం కొన్ని రోజుల పాటు వాయిదా పడిందనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా డేట్‌ ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. జనవరి 9న ఈ ఇద్దరు ఒక్కటి కాబోతున్నారట. ఈ మేరకు డేట్‌ని ఫిక్స్ చేసుకున్నట్టు సమాచారం. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీరి మ్యారేజ్‌ ఈవెంట్‌ జరుగుతుందట. ఎక్కువ మందిని ఆహ్వానించడం లేదని టాక్‌. 

Latest Videos

సింగర్ సునీత తన మొదటి భర్త కిరణ్‌ కుమార్‌ గోపరాజుతో విడాకులు తీసుకుంది. దీంతో చాలా రోజుల పాటు ఒంటరిగానే ఉన్నారు. ఇప్పట్లో మరో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదని పలు ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఉన్నట్టుండి రామ్‌తో మ్యారేజ్‌ని ప్రకటించి సినీ వర్గాలను షాక్‌కి గురి చేసింది సునీత. 
 

click me!