నయనతార స్టొరీ విని అవాక్కయ్యిన మహేష్ !

Published : Mar 10, 2018, 07:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
నయనతార స్టొరీ విని అవాక్కయ్యిన మహేష్ !

సారాంశం

భరత్ అనే నేను’ మూవీ రిజల్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ నయనతార స్టోరీ విని మైండ్ బ్లాంక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి​ కర్తవ్యం కథ అంతా కూడ పొలిటికల్ సిస్టమ్ మీద పోరాటంలా ఉంటుంది. 

భరత్ అనే నేను’ మూవీ రిజల్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ కు నయనతార స్టోరీ విని మైండ్ బ్లాంక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా జరగడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. ఒకొక్కసారి అనుకోకుండా ఒకే కథకు సంబంధించిన అంశంతో సినిమాలు నిర్మాణం జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి స్క్రీన్ ప్లేలో దర్శకుడు తేడాలు చూపించినా మూల కథ ఒకలాగే ఉంటే సమస్యలు ఎదురవ్వడం సర్వసాధారణం. 

ఇప్పుడు అదే పరిస్థితి ‘భరత్ అనే నేను’ కు నయనతార వల్ల ఏర్పడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘ఆరమ్’ గత సంవత్సరం తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈమూవీని ‘కర్తవ్యం’ పేరుతో ఒకప్పటి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ తెలుగులోకి డబ్ చేసి మార్చి 16న విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాలోని కథ అంతా కూడ పొలిటికల్ సిస్టమ్ మీద పోరాటంలా ఉంటుంది. ఇంచుమించు ఇదే స్టోరీ లైన్ తో కొరటాల శివ ‘భరత్ అనే నేను’ కూడ ఉంటుంది. 

దీనితో ఒకే స్టోరీ లైన్ తో ఉండే సినిమాలు కొద్ది గ్యాప్ తో విడుదల అవ్వడం మహేష్ సినిమాకు ఏమైనా సమస్యగా మారుతుందా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ఈ పవర్ ఫుల్ స్టోరీని కొరటాల శివ ఒక అజ్ఞాత రచయిత నుండి కోటి రూపాయల భారీ పారితోషికానికి కొన్నాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇంత డబ్బు పెట్టి కొన్న కథ ఒక డబ్బింగ్ సినిమా కథో పోలి ఉంటే మహేష్ అభిమానులు సహిస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే కొరటాల సినిమాలో మహేష్‌ ఒక ఎన్నిక  కాబడిన రాజకీయ నాయకుడు అయితే ‘కర్తవ్యం’ లో నయనతార ఒక ఐఎఎస్ ఆఫీసర్. ఈచిన్న తేడా మినహా వ్యవస్థ పై వీరిద్దరూ చేసే పోరాటం ఒకటే అని అంటున్నారు. ఏమైనా ఈ వార్తలు భారీ మొత్తాలకు మహేష్ సినిమాను కొనుక్కున్న బయ్యర్లను కలవర పెట్టడం ఖాయం..

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-జ్యోను మనుమరాలే కాదన్న శివన్నారాయణ-నిజం తెలిసిపోయిందా?
అల్లు అర్జున్ కు జపనీయుల షాక్.. జపాన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 పరిస్థితి ఏంటో తెలుసా?