ప్రేమిస్తే లైఫ్ మారిపోతుంది అంటున్న నమ్రత... ఆసక్తి రేపుతున్న సోషల్ మీడియా పోస్ట్

Published : Jan 18, 2021, 09:06 AM ISTUpdated : Jan 18, 2021, 09:09 AM IST
ప్రేమిస్తే లైఫ్ మారిపోతుంది అంటున్న నమ్రత... ఆసక్తి రేపుతున్న సోషల్ మీడియా పోస్ట్

సారాంశం

నమ్రతా శిరోద్కర్ నేలపై పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే తన ఫోటోకి కామెంట్ రూపంలో కొంత ఫిలాసపీ కూడా జోడించారు. నమ్రతా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. 

సూపర్ స్టార్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తిరేపుతోంది. ఆమె నేలపై పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే తన ఫోటోకి కామెంట్ రూపంలో కొంత ఫిలాసపీ కూడా జోడించారు. నమ్రతా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. 

నమ్రత తన పోస్ట్ లో.. ముందుకు వెళ్ళడానికి ఉన్నది ఒకే దారి. ఒకే జీవితం, ఒకే ప్రపంచం, ఒకే దేవుడు, ఒకే లవ్. మనుషుల్ని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళండి... మీ జీవితంలో ఎలా మారిపోతుందో చూడండి, అంటూ ఆమె కామెంట్ పెట్టారు. నమ్రతా ఈ దీర్ఘాలోచన, ఫిలాసఫీ వెనుక కారణం ఏమిటో అర్థం కావడం లేదు. 

నమ్రతా అటు మదర్ గా ఇటు మహేష్ ఆంతరంగిక సలహాదారుగా ఫుల్ బిజీ.  ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటూనే మహేష్ సినిమాలు, వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఒప్పందాలను ఆమె మేనేజ్ చేస్తూ ఉంటారు. అలాగే మహేష్ సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కే సినిమాలు, భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఎంపిక వంటి విషయాలలో కూడా నమ్రతా పాలుపంచుకుంటారు.  15ఏళ్ళ వైవాహిక జీవితంలో మహేష్, నమ్రతా హ్యాపీ కపుల్ గా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Raktha Sambandham Review : ఎన్టీఆర్, సావిత్రి.. అన్నా చెల్లెలుగా నటించే సాహసం ఎలా చేశారు? ఆడియన్స్ ను ఏడిపించిన మహానటి
3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?