
సినిమా జనాలకు సెంటిమెంట్లు ఎక్కువ. సినిమాకి కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి రిలీజ్ తేదీలు, కాంబినేషన్లు.. ఇలా చాలా వాటికి సెంటిమెంట్లు చూసుకుంటారు. ఇప్పుడు అలాంటి సెంటిమెంటే ఒకటి స్పైడర్ సినిమాకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం స్పైడర్. ఇందులో మహేష్ ఇంటలిజెన్స్ అధికారిగా కనిపించనున్నారు. మహేష్ కి జోడిగా రకుల్ నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల చేశారు. అయితే.. టీజర్ ఆకట్టుకునే రీతిలో లేకపోవడంతో మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా పెదవి విరిచారు. దీంతో సినిమా పై కాస్త నెగిటివ్ టాక్ మొదలైంది.
గతంలో ఎన్టీఆర్, మహేష్ సినిమాలు మూడు సార్లు ఒకేదఫాలో విడుదలైతే.. రెండు సార్లు మహేష్ దే పై చేయిగా నిలిచిందట. దీంతో ఆ సెంటిమెంట్ స్పైడర్ కి మళ్లీ రిపీట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా.. ఎప్పుడూ మెగా ఫ్యామిలీ బజన చేసే డైరెక్టర్ హరీష్ శంకర్.. స్పైడర్ సినిమాపై ఇటీవల ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ పొగిడాడంటే సినిమా కచ్చితంగా హిట్ అని అందరూ భావిస్తున్నారు. ఒక్కాసారిగా నెగిటివ్ నుంచి యూటర్న్ తీసుకొని మహేష్ మూవీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే టాక్ తో నడుస్తోంది. మరి నిజంగా హిట్ అవుతుందో లేదే వేచి చూడాలి.