యంగ్ హీరోయిన్ తో మహేష్ రాసలీలలు...వైరల్ అవుతున్న వీడియో..!

Published : Aug 26, 2020, 11:34 AM IST
యంగ్ హీరోయిన్ తో మహేష్ రాసలీలలు...వైరల్ అవుతున్న వీడియో..!

సారాంశం

దివంగత యంగ్ హీరోయిన్  జియా ఖాన్ తో దర్శకుడు మహేష్ భట్ సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ వీడియోని భారీగా వైరల్ చేస్తున్నారు.   

బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మహేష్ భట్ యంగ్ హీరోయిన్ జియా ఖాన్ తో సన్నిహితంగా ఉన్న ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జియా ఖాన్ మహేష్ భట్ కలిసివున్న ఆ వీడియో ఒకరు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది. పరిశ్రమలో మహేష్ భట్ కి స్త్రీలోలుడిగా పేరుంది. అవకాశాలు ఎరజూపి ఆయన అమ్మాయిలను లోబరుచుకొనే వారనే అపవాదు ఉంది.తాజా వీడియో ఆయనపై ఆరోణపణలను మరింత బలపరిచేదిగా ఉంది. 

 ఆ  వీడియోలో ఉన్న జియా ఖాన్ 2013లో  ఆత్మ హత్య చేసుకొని మరణించారు. జియా ఖాన్ మరణంపై ఆమె తల్లి అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. ఆమె మరణానికి కారకుడంటూ సూరజ్ పంచోలి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె మరణించిన ఇన్నేళ్ల తరువాత దర్శకుడు మహేష్ భట్ తో ఆమె చనువుగా ఉన్న వీడియో బయటపడడం సంచలనం రేపుతోంది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత మహేష్ భట్ మరియు అలియా భట్ పై కోపంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ వారి గతాన్ని తవ్వుతున్నారు. మహేష్ భట్ అసలు స్వరూపం భయటపెడతాం అంటూ గతానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇక ఇటీవల ఆయన దర్శకత్వంలో అలియా హీరోయిన్ గా తెరకెక్కిన సడక్ 2 ట్రైలర్ పై వారు ఎంత నెగెటివ్ ప్రచారం చేశారో తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన
Renu Desai: పవన్‌ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైంది.. రేణు దేశాయ్‌ కౌంటర్‌.. న్యాయవ్యవస్థపై ఫైర్‌