వైరల్ అవుతున్న మహేష్ న్యూ లుక్

By Surya PrakashFirst Published Jul 24, 2021, 3:22 PM IST
Highlights

ఆ పొటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. 

రీసెంట్ గా మహేష్ బాబు కోలా బ్రాండ్ ప్రమోట్ చేస్తూ కనిపించారు. బ్లూ టీషర్ట్ తో చాలా డాషింగ్ గా అనిపిస్తున్నారు. దాంతో ఆ పొటోలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం సర్కారు వారి పాట కోసం ఈ లుక్ ని మెయింటైన్ చేస్తున్నట్లు సమాచారం. 

 మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వచ్చే నెలలో లాంచ్ చేయబోతున్నారు. త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ కాంబోలో గతంలో అతడు,ఖలేజా చిత్రాలు వచ్చాయి. హారికా హాసిని బ్యానర్ పై రూపొందే ఈ చిత్రంలో పూజ హెడ్గే హీరోయిన్ గా చేస్తుందని వినికిడి. ఇక రాజమౌళితో మహేష్ బాబు 2022 నుంచి చేయబోతున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నడని తెలుస్తోంది. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న రీసెంట్ గా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలైంది. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ విలన్‌గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. 

అయితే పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.  ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

click me!