Mahesh Babu tested Corona positive:త్వరగా కోలుకో అన్నా.. వైరల్ గా ఎన్టీఆర్ కామెంట్

Published : Jan 07, 2022, 07:10 AM ISTUpdated : Jan 07, 2022, 07:17 AM IST
Mahesh Babu tested Corona positive:త్వరగా కోలుకో అన్నా.. వైరల్ గా ఎన్టీఆర్ కామెంట్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu)కి కరోనా సోకిందన్న వార్త అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియా షేకైనది. ఒక్కసారిగా ట్విట్టర్ లో మహేష్ త్వరగా కోలుకోవాలంటూ విషెస్ తెలియజేస్తూ...సందేశాలు పోటెత్తాయి. 

గురువారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో మహేష్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ న్యూస్ పంచుకున్నారు. ఆయన తనకు కరోనా (Corona Virus)సోకినట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇంట్లో క్వారంటైన్ కావడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నన్ను కలిసిన వారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే అందరూ వ్యాక్సిన్ తప్పక తీసుకోండి. దాని వలన కోవిడ్ సోకినప్పటికీ రిస్క్ లేకుండా బయటపడవచ్చు... అంటూ సందేశం విడుదల చేశారు. 

మహేష్ కి కరోనా అని తెలుసుకున్న ఫ్యాన్స్, చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు స్పందించారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ ట్వీట్ కి కామెంట్ చేశారు. ఎన్టీఆర్ తన ట్వీట్ లో త్వరగా కోలుకో అన్నా.. నీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తున్నాను... అంటూ కామెంట్ చేశారు. మహేష్ ఆరోగ్యంపై ఎన్టీఆర్ స్పందించిన తీరుకు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పరిశ్రమలో ఎన్టీఆర్, మహేష్ చాలా సన్నిహితంగా ఉంటారు. వీరిద్దరికీ రామ్ చరణ్ కూడా మంచి మిత్రుడు. గత ఏడాది ఎన్టీఆర్(NTR) కి కరోనా సోకిన నేపథ్యంలో మహేష్... త్వరగా కోలుకోవాలంటూ  ట్వీట్ చేశారు.కాగా దేశంలో కరోనా వైరస్ తీవ్రత అధికమవుతుంది. రోజుల వ్యవధిలో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కి చెందిన పలువు ప్రముఖులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 

ఇటీవల మహేష్ దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆయన రెండు వారాలకు పైగా గడిపారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. త్వరలో సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ నందు మహేష్ పాల్గొనాల్సి ఉంది. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 1న విడుదల  చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సంక్రాంతి నుండి సర్కారు వారి పాట అప్డేట్స్ ఇవ్వనున్నారట. విడుదలకు మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండగా.. ప్రమోషన్స్ పై నిర్మాతలు దృష్టి పెట్టారు. 

దర్శకుడు పరుశురాం పెట్ల సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రానికి థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.  ఇక సర్కారు వారి పాట బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతుందని సమాచారం.ఈ సినిమాలో మహేష్ లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. మొదట సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం సర్కారు వారి పాట సమ్మర్ కి పోస్ట్ పోన్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు