
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారుల పాలిట దేవుడి అవతారంఎత్తాడు. తన ఫౌండేషన్ ద్వారా ఆగిపోబోతున్న ఎందరో చిన్నారులకు గుండెలకు ప్రాణం పోశాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్‌లు చేయిస్తూ.. వారి పాలిట భగవంతుడైపోయాడు మహేష్ బాబు. ఆయన ఇంత వరకూ వేల మందికి ఇలా సాయం చేస్తున్నా.. ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఈమధ్య కాలంలోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే 2000 లకు పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించిన మహేష్.. ప్రస్తుతం మరో చిన్నారికి ప్రాణం పోశాడు.
మహేష్ బాబు ఈ పనికోసం ప్రత్యేకంగా ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఆయన ఆధ్వర్యంలో హార్ట్ ఆపరేషన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. తాజాగా మహేష్ బాబు మరో చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ సోషల్ మీడియా వేధికగా వెల్లడించాడు. అంతే కాదు మహేష్, నమ్రత దంపతులకుప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే నాగవంశీ ఇలా చెప్పడానికి ఓ కారణం ఉంది. అదేమిటంటే... ఆ చిన్నారికి సమస్య ఉందని .. మహేష్ బాబు ట్రస్ట్ కు తెలిపింది ఈ స్టార్ ప్రొడ్యూసరే. ఇక అసలు విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో నిర్మాత తెలిపిన ప్రకారం ...
రీసెంట్ గా మహేష్ బాబు ఫౌండేషన్ నుండి సహాయం అంది కోలుకున్న చిన్నారి ఫోటోను షేర్ చేశారు నిర్మాత నాగవంశీ.. కొన్నివారాల క్రితం నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒకరు ఫోన్ చేసి ఓ చిన్నారికి అర్జెంట్ గా హార్ట్ సర్జరీ అవసరం ఉందని చెప్పారు. నిరుపేదలైన ఆ ఆ ఫ్యామిలీకి సహాయం చేయాలని.. ఎలాగైనా ఈ విషయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ కి చేరేందుకు హెల్ప్ కోరారు. వారెప్పుడూ ఇలాంటి నిరుపేద ఫ్యామిలీస్, పిల్లలకు సహాయం చేయడానికి పాటుపడుతుంటారు. నేను వెంటనే ఈ విషయాన్నీ మహేష్ బాబు ఫౌండేషన్ కి చేరవేసి.. నమ్రత గారిని పర్సనల్ గా కలిసి చెప్పాను. ఆ తర్వాత ఆమెకు చిన్నారి ఫ్యామిలీ పూర్తి వివరాలు ఫార్వార్డ్ చేశాను అంటూ నాగవంశీ రాసుకొచ్చారు.
ఇక నమ్రత వెంటనే స్పందించి.. ఆ చిన్నారికి హెల్ప్ చేయాలని ఫౌండేషన్ సిబ్బందికి సూచించారు. ఇక ఇప్పుడు ఆ చిన్నారికి సర్జరీ అయిపోయింది. పూర్తిగాకోలుకుంది. ఆ చిన్నారి ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఇదంతా మహేష్, నమ్రతల వల్లే సాధ్యం అయ్యింది. ఇలాంటి ఎన్నో వేల కుటుంబాల ఆశీర్వాదాలు ఆ ఫ్యామిలీపై ఉన్నాయి.. ఉంటాయి కూడా.. ఇంత చేసినా వారు ఎప్పుడూ ఇలా చేశాం అని చెప్పుకోరు. సాయం పొందినవారు బయటకువచ్చిచెపితే తప్పించి.. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. మహేష్ బాబుకు..మరీప్రత్యేకంగా నమ్రత గారికి కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చారు నిర్మాత నాగవంశీ.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న SSMB28 మూవీని నాగవంశీనే నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా షూటింగ్ కొన్ని అడ్డంకులు దాటుకుని రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. సూపర్ ఫాస్ట్ గా మూవీని కంప్లీట్ చేసి..రాజమౌళి సినిమాకురెడీ అవ్వాలని చూస్తున్నాడు మహేష్ బాబు.