ఇంటలిజెన్స్ ఆఫీసర్ మహేష్ బాబు బిజీ షూటింగ్

Published : Nov 14, 2016, 04:43 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఇంటలిజెన్స్ ఆఫీసర్ మహేష్ బాబు బిజీ షూటింగ్

సారాంశం

శరవేగంగా మహేష్,మురుగదాస్ మూవీ షూటింగ్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ అహ్మాదాబాద్ నగరంలో ఈనెల 24 నుంచి షూటింగ్

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ స్టార్ మహేష్ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ గత నెల రోజులుగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ షెడ్యూల్ లో సూపర్ స్టార్ మహేష్ కు సంబంధించిన పలు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. నిన్నటితో ఈ షెడ్యూల్‌ను పూర్తయింది. ఇప్పటివరకూ 60% పైనే పూర్తైన షూట్ ఔట్‌పుట్‌పై టీమ్ చాలా హ్యాపీగా ఉందట.

                  

ఇక ఈనెల 24 నుంచి అహ్మదాబాద్‍లో మరో భారీ షెడ్యూల్ మొదలుకానుంది. అహ్మదాబాద్ షెడ్యూల్ తర్వాత షూటింగ్ చివరిదశకు చేరుకుంటుందని సమాచారం. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్‍తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మహేష్ సరసన రకుల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నారు. మహేష్ ఈ సినిమాలో ఇంటిలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. వచ్చే జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Patang Review: పతంగ్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. క్రిస్మస్‌ విన్నర్‌ ఈ సినిమానేనా?
చిరంజీవి భారీ బడ్జెట్ చిత్రం, రిలీజ్ రోజే చనిపోవాలని అనిపించింది.. నిర్మాత చేసిన మిస్టేక్ వల్లే డిజాస్టర్