ఆన్ లైన్ లో 'మహర్షి' సీన్లు.. షాక్ లో మహేష్!

By Udayavani DhuliFirst Published Dec 29, 2018, 2:38 PM IST
Highlights

సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తున్న విషయం పైరసీ. భారీ బడ్జెట్ సినిమాల నుండి కాస్త ఫేమ్ ఉన్న సినిమాలన్నింటికీ దీని బెడద తప్పడం లేదు. కొంతమంది లీకువీరులు సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే కొన్ని సన్నివేశాలను లీక్ చేస్తున్నారు. 

తాజాగా మహేష్ బాబు 'మహర్షి' సినిమాకు ఇటువంటి సమస్యే తలెత్తింది. ఈ సినిమా షూటింగ్ అవుట్ డోర్ లో జరుగుతున్న సమయంలో కొంతమంది అభిమానులు అత్యుత్సాహంతో వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టేశారు.

వాటిలో మహేష్ బాబు, అల్లరి నరేష్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయు. అలానే సినిమాలో ఒక పాటకి సంబంధించిన విజువల్స్ కూడా ఆన్ లైన్ లో లీకయ్యాయి. విషయం గ్రహించిన చిత్రబృందం వాటిని ఆన్ లైన్ నుండి తొలగించే విధంగా చర్యలు తీసుకుంది.

దీంతో సినిమాకు భారీ నష్టం తప్పిందనే చెప్పాలి. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే చివరి షెడ్యూల్ ని మొదలుపెట్టనుంది. వంశీపైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

click me!