దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) నెక్ట్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి.
‘బాహుబలి’,‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). RRRతో హాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్స్ నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో జక్కన్న నెక్ట్స్ తెరకెక్కించబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)తో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే గ్లోబల్ ఈవెంట్లలో పాల్గొన్న రాజమౌళి గ్లోబల్ మీడియాతో మాట్లాడుతూ సినిమాపై అంచనాలు పెంచేశారు.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. స్టార్ రైటర్ విజేయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకాచకా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రొడక్షన్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ పనుల కోసమే రూ.15 కోట్లకు పైగా మేకర్స్ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈస్థాయిలో వెచ్చిస్తుండటంతో సినిమా బడ్జెట్ పైనా అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు జక్కన్న కూడా బెస్ట్ అవుట్ పుట్ కోసం ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గరనే విషయం తెలిసిందే.
ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా వెచ్చించి SSMB29ను రూపొందించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీతో ఇండియన్ సినిమాను నెక్ట్స్ లెవల్ కు తీసుకునేందుకు రాజమౌళి కసరత్తులు ప్రారంభించారు. ‘ఎస్ఎస్ఎంబీ29’లో హాలీవుడ్ తారాగణం కూడా కనిపించనుందని, టెక్నిషీయన్స్ కూడా హాలీవుడ్ కు చెందిన వారే ఉంటారని టాక్ నడుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండటంతో ఈ ఏడాదే షూటింగ్ కు వెళ్లే అవకాశం ఉంది. జూన్ లేదా జూలైలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారని ప్రచారం.
చివరిగా ‘సర్కారు వారి పాట’తో అలరించిన మహేశ్ బాబు.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. పదేండ్ల తర్వాత రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఎస్ఎస్ఎంబీ28’ వర్క్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై చిన్నబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పూజాహెగ్దే, శ్రీలాలీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల చేసేందుకు షెడ్యూల్ చేశారు. ఈ చిత్రం అనంతరం మహేశ్ బాబు - రాజమౌళి చిత్రం ప్రారంభం కానుంది.