రూ.50 కోట్ల షేర్ కు దగ్గరలో 'మహర్షి'!

Published : May 13, 2019, 12:38 PM IST
రూ.50 కోట్ల షేర్ కు దగ్గరలో 'మహర్షి'!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ముగ్గురు నిర్మాతలు దిల్ రాజు, పివిపి, అశ్వనీదత్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగా వస్తున్నాయి. తొలి వారంలో మొత్తం నాలుగు రోజులకు కలిపి ఈ సినిమా రూ.47.89 కోట్ల షేర్ ని రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఆదివారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.8.08 కోట్లు రాబట్టింది. తొలిరోజే రూ.24 కోట్ల షేర్ ని రాబట్టిన ఈ సినిమా లాంగ్ వీకెండ్ ని మాత్రం సరిగ్గా వినియోగించుకోలేకపోయిందనే  కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఓవర్సీస్ లో కూడా మొదటి రెండు రోజులు బాగానే వసూళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికి మాత్రం తగ్గుముఖం పడుతున్నట్లు సమాచారం. సినిమాకి మిశ్రమ స్పందన రావడం, సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ ఎక్కువ కావడమే దానికి కారణాలుగా చెబుతున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Demon Pavan : రీతూ తో జంటగా డీమాన్ పవన్ మరో స్పెషల్ షో, స్టేజ్ పై రెచ్చిపోయి రొమాన్స్ చేయబోతున్న జోడి.. నిజమెంత?
2026 కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్ రెడీ.. జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతన్నాడా?