మహేష్ సొంత థియేటర్ లో మహర్షి న్యూ రికార్డ్

Published : May 20, 2019, 12:17 PM ISTUpdated : May 20, 2019, 12:25 PM IST
మహేష్ సొంత థియేటర్ లో మహర్షి న్యూ రికార్డ్

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా రిలిజయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్నప్పటి నుంచి మహేష్ ప్రమోషన్స్ డోస్ ఇంకాస్త పెంచాడు. 10 రోజుల్లోనే అదిరిపోయే బిజినెస్ చేస్తోన్న ఈ మహర్షి మహేష్ థియేటర్ లో కూడా మంచి వసూళ్లనే రాబట్టింది. 

AMB సినిమస్ మహేష్ ఆధ్వర్యంలోనే నడుస్తోందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకూ సరైన బాక్స్ ఆఫీస్ సినిమా రాకపోవడంతో ఈ మల్టిప్లెక్స్ లో అనుకున్నంతగా కలెక్షన్స్ రాలేవు. అయితే రీసెంట్ గా మహర్షి AMBలో కోటికిపైగా షేర్స్ ను అందుకొని  సరికొత్త రికార్డును నమోదు చేసింది.  

సాధారణంగా ఏ సినిమాలైనా నైజం ఏరియాలో సింగిల్ థియేటర్ లో ఈ స్థాయిలో కలెక్షన్స్ ను అందుకోవాలంటే మినిమమ్  నాలుగైదు వారాలైనా సమయం పడుతుంది.  . అదికూడా పెద్ద సినిమా అయితేనే.  కానీ AMBలో 10 రోజుల్లోనే కోటికిపైగా కలెక్షన్స్ ను సాధించింది. ఇక్కడ రిలీజైనప్పటి నుంచి మహర్షి రెండెకల షోలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు టోటల్ గా 80కొట్ల షేర్స్ ను సాధించిన ఈ సినిమా హిట్ లిస్ట్ లో చేరాలంటే ఇంకా 20 కోట్ల వరకు రాబట్టాలి. మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ 100కోట్లు. 

PREV
click me!

Recommended Stories

4 నెలల్లో 5 సినిమాలు.. ఒకటే హిట్, 4 డిజాస్టర్లు.. ఆమిర్ ఖాన్ కెరీర్‌లో ఆసక్తికర రికార్డ్
Karthika Deepam 2 Today Episode: దశరథ, కాంచనల మధ్య దూరం పెంచిన పారు- కాంచన ఎమోషనల్-నోరు జారిన జ్యో