మహర్షి @100 కోట్లు.. ఇంకా ఎంత రావాలంటే?

Published : May 13, 2019, 08:19 PM ISTUpdated : May 13, 2019, 08:20 PM IST
మహర్షి @100 కోట్లు.. ఇంకా ఎంత రావాలంటే?

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో మరో సినిమా బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా విడుదలైన స్పెషల్ మూవీ మహర్షి మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది. మొదటి నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. 

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు - పివిపి - అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. ఇంకా సినిమా లాభాల్లోకి రావాలంటే 40 కోట్లకు పైగా రాబట్టాలి.ఇప్పటికే 60 కోట్ల షేర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్ చెప్పిన గ్రాస్ కలెక్షన్స్ ని బట్టి చుస్తే ఈ వీక్ లోనే 40కోట్ల షేర్స్ ను రాబట్టాలి.సినిమా పెట్టిన బడ్జెట్ 100 కోట్లు. ఈ వీక్ మహర్షికి కీలకం కానుంది. 

నిజానికి ఓవర్సీస్ కలెక్షన్స్ కాస్త దెబ్బేశాయని చెప్పాలి. ప్రవాసులు ఈ సారి మహేష్ సినిమాపై అంతగా ఆసక్తి  కనబరచలేదని అర్థమైపోయింది. ఎందుకంటే చిటికెలో ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ మార్క్ ను అందుకునే మహేష్ ఒకరోజు గడిచిన తరువాత గాని ఆ మార్క్ ను అందుకోలేకపోయాడు.  మరి మొత్తంగా మహేష్ మహర్షి ఈ వీక్ లో ఎలాంటి లాభాల్ని అందిస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

'రౌడీ జనార్ధన' గ్లింప్స్ రివ్యూ.. కింగ్డమ్ లా గురి తప్పేలా లేదు, విజయ్ దేవరకొండ బీభత్సం చూశారా
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?