మహర్షికి తెలంగాణాలో ఫేవర్.. ఆంధ్రాలో ?

Published : May 07, 2019, 09:00 PM IST
మహర్షికి తెలంగాణాలో ఫేవర్.. ఆంధ్రాలో ?

సారాంశం

బ్లాక్ టిక్కెట్ల మార్కెట్ ని అరికట్టడానికి, ధియోటర్స్ దగ్గర భారీ ఎత్తున క్రౌడ్ ని ఎవాయిడ్ చేయటానికి తెలంగాణా గవర్నమెంట్  మహర్షి సినిమాకు ఐదు షోల పర్మిషన్ ఇచ్చింది. రెండు వారాల పాటు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది.  

బ్లాక్ టిక్కెట్ల మార్కెట్ ని అరికట్టడానికి, ధియోటర్స్ దగ్గర భారీ ఎత్తున క్రౌడ్ ని ఎవాయిడ్ చేయటానికి తెలంగాణా గవర్నమెంట్  మహర్షి సినిమాకు ఐదు షోల పర్మిషన్ ఇచ్చింది. రెండు వారాల పాటు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది.  

ఈనెల 9 నుంచి 22 వరకు ఉదయం 8-11 గంటల మధ్యలో ఒక షో అదనంగా ప్రదర్శించేందుకు తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. నిర్మాత దిల్‌ రాజు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరో ప్రక్క  ఈ చిత్రం స్పెషల్‌ షోలకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కూడా నిర్మాతలు కోరినప్పటికీ ఇంకా ఎలాంటి స్పందన రాలేదని  సమాచారం.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యు/ఏ సర్టిఫికెట్‌ జారీచేసింది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించగా ..అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించాడు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌, జయసుథ, మీనాక్షి దీక్షిత్‌, రాజేంద్రప్రసాద్‌, ముఖేష్‌ రుషి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్